English | Telugu

బాలకృష్ణ గారు ఇష్టమా, జూనియర్  ఎన్టీఆర్ గారు ఇష్టమా ? విశ్వక్ కి షాక్ ఇచ్చిన సుధీర్

ఫ్యామిలీ స్టార్ప్రోమోలో యాంకర్ సుడిగాలి సుధీర్ విశ్వక్ ని అడిగిన ప్రశ్నకు ఒక్కసారిగా షాకయ్యాడు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున "లైలా" మూవీతో ఆడియన్స్‌ని పలకరించబోతున్నాడు విశ్వక్ సేన్. విశ్వక్ హీరోగా ఒక లేడీ గెటప్‍‌ లో కనిపించబోతున్నాడు . ఈ మూవీ ప్రమోషన్స్ కోసం లైలా మూవీ టీమ్ ఫామిలీ స్టార్స్ సెట్ కి వచ్చారు. ఇక ఈ షోలో సుధీర్‌తో పాటు యాంకర్ స్రవంతి, అషూ రెడ్డి కూడా సందడి చేశారు. వీళ్ళ ఇద్దరితో కలిసి స్టెప్పులు వేశాడు విశ్వక్. ఇక ప్రోమో చివరిలో బాలకృష్ణ విశ్వక్‌ సేన్ కి ముద్దు పెడుతున్న పిక్ చూపించి ఇంట్రెస్టింగ్ కొశ్చన్ అంటూ అడిగాడు సుధీర్. "ఆ టైమ్‌లో టక్ మని బాలయ్య మీకు ముద్దు పెట్టగానే మీకు ఏం అనిపించింది" అంటూ సుధీర్ అడిగాడు. ముందుగా ఆయనకు పద్మభూషణ్ వచ్చినందుకు కంగ్రాట్స్ అని చెప్పాడు విశ్వక్. "మీరు ఇప్పటికీ ఆయన్ని బ్రో" అనే పిలుస్తారా అనేసరికి అవును అన్నాడు..

ఆ మాటకు ఇక సుదీర్ "మాదొకటే సర్ జై బాలయ్య" అని అరిచాడు. తర్వాత " బాలకృష్ణ గారు ఇష్టమా, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టమా" అంటూ సుధీర్ అడిగాడు. దాంతో ఎం ఆన్సర్ చెప్పాలో విశ్వక్ కి అర్థంకాక అసలు ఏ టైంలో ఎం ప్రశ్న అడిగావు సుధీర్ అంటూ ఒక లుక్ ఇచ్చాడు విశ్వక్. మరి ఇంతకు ఎం ఆన్సర్ ఇస్తాడో ఎపిసోడ్ లోనే చూడాలి. ఐతే సుధీర్ ఇంకోటి కూస విశ్వక్ ని అడిగాడు "సార్.. టీజర్ లాస్ట్‌లో ఒకావిడ వచ్చింది కదా.. ఆవిడ నంబర్ ఉంటే ఇస్తారా" అంటూ కొంటెగా అడిగాడు. అప్పుడు కూడా విశ్వక్ ఒక రేంజ్ లో చూసాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.