English | Telugu

Ilu illalu pillalu : భద్రవతి ఫోన్ తో పెళ్ళి సంబంధం క్యాన్సిల్..  ఎమోషనల్ అయిన రామరాజు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -82 లో.....నర్మద చందుకి సంబంధం తీసుకొని వస్తుంది. దాంతో అందరు అమ్మాయిని చూడడానికి వెళ్తారు. అక్కడ అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు ఇష్టం అనుకుంటారు. అదే సమయంలో అమ్మాయి తండ్రికి ఫోన్ వస్తుంది. దాంతో తను మాట్లాడడానికి వెళ్తాడు. మరొకవైపు దీరజ్ దగ్గరకి ప్రేమ వచ్చి.. ఏం తింటావో చెప్పు అత్తయ్య వంట చేయమందని అడుగుతుంది. నేను ఏం తినను అంటూ దీరజ్ అంటాడు. నీకు ఒక విషయం తెలుసా.. భార్య చేసిన వంట తింటే భర్తలకి వాళ్ళపై ప్రేమ పుడుతుంది. అందుకే మీ నాన్న మీ అమ్మ చేసిన వంట తింటాడు కాబట్టి.. వాళ్ళు ఇద్దరు ఎంత ప్రేమ గా ఉంటారు.. అందుకే నేను వంట చేస్తానని ప్రేమ రివర్స్ గేమ్ ప్లే చేస్తుంది.

Karthika Deepam2 : బర్త్ డే పార్టీకి కేటరింగ్ చేస్తున్న కార్తీక్.. అక్కడ చూసి షాకైన శ్రీధర్ !

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -281 లో....శ్రీధర్ ఏదో వెతుకుతుంటాడు అప్పుడే కావేరి వచ్చి.. మీరు కార్తీక్ ఇచ్చిన నోట్ గురించి వెతుకుతున్నారు కదా అని అడుగుతుంది. అవునని అనగానే.. అది మీకెందుకు అన్నట్లు కావేరి పొగరుగా సమాధానం చెప్తుంది. అప్పుడే శ్రీధర్ ఫ్రెండ్ కాల్ చేసి తన మనవడి బర్త్ డే కి రమ్మని చెప్తాడు. సరే అని శ్రీధర్ ఫోన్ కట్ చేసి.. బర్త్ డే కి వెళదామని అంటాడు. నేను రానని కావేరి చెప్పి వెళ్ళిపోతుంది. రాకు నేను ఒక్కడినే వెళ్తానని శ్రీధర్ అనుకుంటాడు.

Eto Vellipoyindhi Manasu : మామ అల్లుడిని చూసి షాకైన కుటుంబం... రామలక్ష్మిని సీతాకాంత్ చూస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -328 లో..... మైథిలి షటిల్ ఆడి ఓడిపోతుంది. ఏంటి అమ్మ గెలిచే అవకాశం ఉన్నా ఓడిపోయావని వాళ్ళ తాతయ్య అడుగుతాడు. మనం గెలవడం కంటే వేరే వాళ్ళని గెలిపించడంలోనే సంతోషం ఉంటదని మైథిలి చెప్పడంతో పెద్దోళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు వెళ్లి ఫ్రెషప్ అవు.. నీకు సర్ ప్రైజ్ అని మైథిలికి తన గ్రాండ్ పేరెంట్స్ చెప్తారు. మరొకవైపు సిరి కొడుకు రామ్ ఎనిమిది సంవత్సరాల వాడు అవుతాడు. సీతాకాంత్ ని ఆట పట్డిస్తుంటాడు. శ్రీలత, శ్రీవల్లి, సందీప్ లని పేరు పెట్టి పిలస్తూ ఒక ఆట ఆడుకుంటాడు.

Brahmamudi : ఇక్కడ అందరు సంతకాలు.. అక్కడ నందగోపాల్  కోసం అప్పు ఛేజింగ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -645 లో.... అప్పుకి కళ్యాణ్ లంచ్ బాక్స్ తీసుకొని వస్తాడు. అది చూసి స్టేషన్ లోని వాళ్ళంతా మాట్లాడతారు. ఇలా మీరు భార్య భోజనం తీసుకొని రావడం గ్రేట్ అంటూ కళ్యాణ్ ని పొగుడుతారు. దాంతో అప్పు జెలస్ గా ఫీల్ అయి.. వాళ్ళని తిట్టి పంపిస్తుంది. ఎందుకు ఆలా కోప్పడుతున్నావ్ అని కళ్యాణ్ అంటాడు. మరి నా ముందు నిన్ను పొగుడుతుంటే నాకూ సిగ్గుగా ఉందంటూ అప్పు సిగ్గు పడుతుంది. మరోవైపు శృతి స్టాలు సెట్ చేస్తుంది‌. ఇది ఒకసారి వీడియో తీసి మేడమ్ కి పంపాలని శృతి వీడియో తీస్తుంటే.. నందగోపాల్ ఫోన్ మాట్లాడుతూ అడ్డు వస్తాడు. దాంతో పక్కకు జరగండి అంటూ శృతి చెప్తుంది. శృతి తీసిన వీడియోలో నందగోపాల్ ఉంటాడు.

బిగ్ బాస్ పై సెన్సేషనల్ కామెంట్స్...విన్నర్ అవ్వాలంటే...

సోనియా ఆకుల బుల్లితెర మీద ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్న పేరు. సోనియా కూడా అన్ని రకాల షోస్ లో కనిపిస్తోంది. ఇష్మార్ట్ జోడి 3 లో భర్త యష్ తో వచ్చి టాస్కులు ఆడుతోంది. మిగతా జోడీస్ కి కూడా టఫ్ ఫైట్ ఇస్తోంది. అలాంటి సోనియా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో "మీరు నా గురించి ఎం తెలుసుకోవాలనుకుంటున్నారు" అంటూ నెటిజన్స్ ని అడిగింది. దానికి ఒక నెటిజన్ "బిగ్ బాస్ సీజన్ 9 కి అవకాశం వస్తే వెళ్ళండి అక్కా మిమ్మల్ని ఫస్ట్ లేడీ విన్నర్ గా చూడాలని ఉంది" అని అడిగారు "బిగ్ బాస్ అనుకుంటేనే తప్ప విన్నింగ్ అన్నది ఎవరి చేతుల్లోనూ ఉండదుమా" అని సోనియా ఆన్సర్ ఇచ్చింది. అలాగే ఫాక్ట్స్ ఆఫ్ ది షో అనే హాష్ టాగ్ కూడా పెట్టింది. ఐతే సోనియా యూపిఎస్సి యాస్పిరెంట్ కూడా..ఐతే ఒక నెటిజన్ ఐతే "హాయ్ అక్క మీరు ఎన్నిసార్లు యూపిఎస్సి అటెంప్ట్స్ ఇచ్చారు. మళ్ళీ ఎందుకు ఇవ్వలేదు. సజెషన్స్ చెప్పండి " అని అడిగేసరికి "రెండు అటెంప్ట్స్ ఇచ్చా ఐతే మైన్స్ కి వెళ్ళలేపోయా. ఫైనాన్సియల్ గా వీక్ కాబట్టి నేను సంపాదించుకోవాలి, చదువుకోవాలి .. దాంతో అటెంప్ట్ చేయలేకపోయా" అని చెప్పింది.

సమంత గనక ఈ రీల్ చూస్తేనా ..?

బుల్లితెర మీద జెస్సి అలియాస్ జెశ్వంత్ ఒకప్పుడు బాగా ఫేమస్. జబర్దస్త్ లో శ్రీదేవి డ్రామా కంపెనీలో, ఢీ షోలో కనిపించేవాడు. బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా వెళ్ళాడు.  అతనో ఫ్యాషన్ డిజైనర్.. ర్యాంప్ వాకర్.. మోడలింగ్.. ఫ్యాషన్.. యాక్టింగ్‌ పై ఇంటరెస్ట్ తో ముందుగా  మోడలింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. బెంగుళూరులో జరిగిన కొన్ని  ఫ్యాషన్ షోలలో పాల్గొని అవార్డ్స్ తీసుకున్నాడు. మిస్టర్ ఏపీ ట్రెడిషనల్ ఐకాన్‌గా ఎంపిక అయ్యాడు. ఆ తరువాత మోడల్ హంగ్ సీజన్ 2 విజేత అయ్యాడు. అలాంటి జెస్సి కొంత కాలంగా బుల్లితెరకు దూరంగా ఉంటున్నాడు. ఇన్స్టాగ్రామ్ పేజీలో మాత్రం అప్డేట్స్ పెడుతూనే ఉన్నాడు.

Illu illalu pillalu : మామయ్యకి ఎదురుతిరిగిన కొత్త కోడలు.. రామరాజుతో పాటు కుటుంబమంతా షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్నా సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -81 లో.....నర్మద తన ఫ్రెండ్ తో చందు గురించి చెప్తుంది. మా పిన్ని వాళ్ళ అమ్మాయి ఉంది.. నేను వాళ్ళతో చెప్పి కాల్ చేస్తానని తను నర్మద తో అంటుంది. ఆ తర్వాత నర్మద ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంది.  తన ఫ్రెండ్ కాల్ చేసి మా వాళ్లకి సంబంధం గురించి చెప్పాను.. వాళ్లు ఒకే అన్నారని నర్మద ఫ్రెండ్ అనగానే.. మరి మా పెళ్లిళ్ళు గురించి చెప్పావా అని నర్మద అడుగుతుంది. చెప్పానని తను అనగానే నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పాలనుకోని హాల్లోకి వస్తుంది.

Karthika Deepam2 : కావేరిని చిన్నమ్మ అని పిలిచిన కార్తీక్.. తండ్రికిచ్చిన మాటని నిలబెట్టుకుంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -280 లో.....కాంచన, దీపలు కావేరికి కృతజ్ఞతలు చెప్పాడానికి తన ఇంటికి వెళ్తారు. నిన్ను నా ప్రవర్తనతో బాధపెట్టాను కానీ నువ్వు నా మనవరాలి ప్రాణం కాపాడవని కావేరికి కాంచన థాంక్స్ చెప్తుంది. దాంతో కావేరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే అక్కడికి శౌర్యని తీసుకొని వస్తాడు కార్తీక్. తాతయ్య చిన్న నానమ్మ అంటు కావేరి దగ్గరికి శౌర్య వస్తుంది. నాకు మీరు ఏదో హెల్ప్ చేశారు అంట కదా నాన్న థాంక్స్ చెప్పన్నాడని శౌర్య అంటుంది.

Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ కి బాబుని అప్పగించిన శ్రీలత..  ఆ మైథిలీ ఎవరంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -327 లో.... రామలక్ష్మికి పిండప్రధానం చెయ్యాలని శ్రీలత పంతులిని పిలిపిస్తుంది. నువ్వే పిండప్రధానం చెయ్యాలని శ్రీలత సీతాకాంత్ తో అనగానే.. నా చేతులతో నేను ఎలా చెయ్యాలి అంటూ సీతాకాంత్ బాధపడుతుంటాడు‌‌. అక్కకి ఆత్మ శాంతిస్తుందని శ్రీవల్లి అంటుంది‌. దాంతో సీతాకాంత్ ఒప్పుకుంటాడు.నేను ఒప్పుకోనంటూ మాణిక్యం ఎంట్రీ ఇస్తాడు.. నా కూతురు చనిపోతే తన బాడీ అన్న దొరకాలి కదా.. నా కూతురు చనిపోలేదని మాణిక్యం అంటాడు. చనిపోయింది అని సీతాకాంత్ అంటాడు.

Brahmamudi : సీతారామయ్య నిర్ణయంతో రుద్రాణి షాక్.. కుటుంబం విచ్ఛిన్నం అవుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -644 లో.... ఆస్తుల్లో మా వాటాలు మాకిచ్చి మీరు ఏమైనా చేసుకోండి అంటూ ధాన్యలక్ష్మి కఠినంగా మాట్లాడుతుంటే.. అప్పుడే ఇందిరాదేవి, సీతారామయ్య వస్తారు. నా మాటకి విలువ లేనప్పుడు.. నా ఆస్తులు ఎందుకని సీతారామయ్య ముక్కుసూటిగా మాట్లాడతాడు. అంటే మీ వారసుల గురించి ఆలోచించరా అని ధాన్యలక్ష్మి అనగానే.. మాటకి విలువ ఇవ్వనివారు ఎలా వారసులు అవుతారని ఇందిరాదేవి అంటుంది. రాజ్ నువ్వు ఆస్తులు అమ్మి ఆ అప్పు కట్టు అంటూ రాజ్ కి సీతారామయ్య చెప్తాడు.

Karthika Deepam2 : సవతి దగ్గరకి కాంచన.. అందరు ఇలా మారిపోతున్నారేంటి!

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -279 లో....కార్తీక్ దగ్గరికి దీప వస్తుంది. తనని చూడడానికి కూడా కార్తీక్ ఇష్టపడడు. ఈ వారం రోజుల్లో మనకి సాయం చేసిన మనిషి గురించి ఎవరు ఎవరు అంటూ డిస్కషన్ చేసుకున్నాం.. ఒక్కసారి కూడా నీకు చెప్పాలి అనిపించలేదా అని కార్తీక్ అంటాడు. కావేరి గారు ఎవరికి చెప్పొద్దని మాట తీసుకున్నారని దీప అనగానే.. ఇప్పుడు నేను అందరి ముందు మాట పడాల్సి వచ్చింది. నన్ను ఇంట్లో నుండి గెంటేసారు. ఇప్పుడు నేనే నీ కూతురికి సాయం చేసానని చెప్తున్నాడంటూ కార్తీక్ బాధపడుతాడు. అప్పుడే కాంచన వస్తుంది. కావేరి గారు నాకు సాయం చేసిన విషయం మొదట నాక్కూడా తెలియదంటూ దీప జరిగింది మొత్తం చెప్తుంది.

Eto Vellipoyindhi Manasu : స్పృహలోకి వచ్చిన సీతాకాంత్.. రామలక్ష్మి డెడ్ బాడీ దొరుకుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏటో వెళ్లిపోయింది మనసు'(Eto  Vellipoyindhi Manasu).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -326 లో..... లాయర్ సందీప్ వాళ్ళ దగ్గరకి వస్తాడు. ఇక ఆస్తి మా పేరున రాయడానికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు కదా అని సందీప్ అనగానే.. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. సీతాకాంత్ , రామలక్ష్మి లు చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని లాయర్ అనగానే.. వాళ్ళను చంపించిన వాళ్ళం.. అది తీసుకొని రావడం మాకు పెద్ద సమస్య కాదని సందీప్ అంటాడు. అప్పుడే సీతాకాంత్ ఫ్రెండ్ సీఐ ఇంటికి వస్తాడు. రామలక్ష్మి,  సీతాకాంత్ ల ఫోన్ కలవడం లేదు. అందుకే వచ్చాను ఎక్కడికి వెళ్లారని సీఐ వాళ్ళపై డౌట్ గా అడుగుతాడు.

Brahmamudi : అసలు నిజం తెలుసుకున్న అపర్ణ.. ఆస్తి కోసం ధాన్యలక్ష్మి పంతం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -643 లో.... ఆస్తుల గురించి మనం అడగాలని ప్రకాష్ కళ్యాణ్ లకి ధాన్యలక్ష్మి చెప్తుంది ఇప్పుడున్న పరిస్థితి ఏంటి మీరు ఆలోచించేది ఏంటని కళ్యాణ్ అంటాడు. దాంతో ధాన్యలక్ష్మి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నేను మా అన్నయ్య దారిలో నడిచి తప్పు చేసానని ఫీల్ అవుతున్నాను.. నువ్వు అలాగే చేస్తున్నావ్.. ఆ తప్పు చెయ్యకు అని కళ్యాణ్ తో ప్రకాశ్ చెప్తాడు. మరొకవైపు రుద్రాణి, రాహుల్ లు స్వప్న దగ్గరికి వచ్చి తనని రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తారు. ఇంట్లో సిచువేషన్ చూస్తున్నావ్ కదా కావ్య అప్పు చేసింది.. అది తీర్చడానికి అన్ని ఆస్తులు అమ్ముతారు.. మా నాన్న నీకు ఇచ్చిన ఆస్తి కూడా అమ్ముతారని స్వప్నతో రుద్రాణి చెప్పి వెళ్ళిపోతుంది.