English | Telugu

రష్మీని యాంకరింగ్ బాధ్యతల నుంచి తప్పిస్తున్నారా ?

నిజంగా ఒకప్పుడు సుమ యాంకరింగ్ నుంచి తప్పుకోవాలంటూ బుల్లితెర మీద చాలా మంది కామెంట్స్ చేసారు. ఇక ఇప్పుడు రష్మీ మీద అలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో యాంకరింగ్ నుంచి రష్మీని తప్పించే ప్లాన్ కనిపిస్తోంది. ఐతే చాలామంది రష్మీకి సపోర్ట్ చేస్తూ నిలబడ్డారు. ముఖ్యంగా రాకెట్ రాఘవ మాత్రం మందు బోటిల్ చేతిలో పట్టుకుని వచ్చి మరీ రష్మీ గురించి చెప్పాడు. వస్తూనే పుష్పలో శ్రీవల్లి డైలాగ్ ని చెప్పించాడు రాఘవ.. ఒకతన్ని నిలబెట్టి నువ్వెవరు అంటే రష్మీ గారి రైటర్ ని అన్నాడు ఇంకోకతన్ని చూపించేసరికి రష్మీ డ్రైవర్ అని చెప్పాడు. ఇంకో వ్యక్తిని అడిగితె రష్మీ మేకప్ మ్యాన్ అని చెప్పాడు.

మీరు వెళ్ళింది భక్తి కోసమా,ఇన్‌స్టా స్టోరీ కోసమా...లాస్యకి నెటిజన్ కౌంటర్

ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. భక్తులు కూడా కోట్ల మంది వెళ్లి పుణ్యస్నానాలు చేసుకుంటూ వస్తున్నారు. సామాన్యులు మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలకు హాజరవుతున్నారు. ఇక రీసెంట్ గా   యాంకర్ లాస్య తన ఫ్యామిలీతో కలిసి మహా కుంభమేళాలో సందడి చేసింది. లాస్య అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసింది. మహాకుంభమేళలో తమ  పర్యటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. "సంగమంలో ఒక పవిత్ర మునక వేసేసరికి నాలో ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టుగా  అనిపించింది " అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ పిక్స్ చూసాక నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. "అక్కడ కూడా ఫోటో షూట్స్ అవసరమా.

Eto Vellipoyindhi Manasu : జైలు నుండి బయటకు తీసుకొచ్చింది మా అన్నయ్యే.. షాక్ లో శ్రీలత!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -316 లో.... సందీప్ ధన ఇద్దరు బయటకుకి వస్తారు. నేను చేసిన ప్రయత్నం ఫలించిందని రాజీవ్ అంటాడు. అంటే మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చింది మీరా అని సందీప్ అంటాడు. అవునని చెప్పగానే రాజీవ్ కి ఇద్దరు థాంక్స్ చెప్తారు. సరే మళ్ళీ కలుద్దామంటూ రాజీవ్ వెళ్ళిపోతాడు. ధన, సందీప్ లు ఆటో కోసం చూస్తుంటే అప్పుడే రామలక్ష్మి వస్తుంది. వాళ్ళని చూసి షాక్ అవుతుంది. ఏంటి వీళ్ళు బయటకు వచ్చారని అనుకుంటుంది. వెళదాం పదా మనలాంటి వాళ్ళు డబ్బు ఇస్తేనే కదా వాళ్ళ కడుపు నిండేది అని ధనతో సందీప్ అంటాడు. ఇద్దరు రామలక్ష్మి ఆటో ఎక్కుతారు.