బాలకృష్ణకు ఫోన్ చేసిన విశ్వక్..షాకైన సుమ
సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి లైలా మూవీ టీమ్ వచ్చింది.హీరో విశ్వక్ సేన్ , హీరోయిన్ ఆకాంక్ష శర్మ, డైరెక్టర్ రామ్ నారాయణ్, డిజె టిల్లు ఫేమ్ ప్రణీత్ రెడ్డి వచ్చారు. ఈ షో ప్రోమో ఫైనల్ లో బాలకృష్ణ మాట్లాడారు..ఎందుకు మాట్లాడారో చూద్దాం. ఐతే రీసెంట్ గా లైలా మూవీ టీజర్ రిలీజ్ సందర్భంలో బాలకృష్ణ అటు డిజె టిల్లుకి, ఇటు విశ్వక్ సేన్ కి ముద్దులు పెట్టేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. సుమ ఆ వీడియో ప్లే చేసి చూపించింది. "అదేం లేదు మేడం మేమందరం కలిసి కాఫీ తాగుతూ అలా ఎంజాయ్ చేసాం" అని కవర్ చేసాడు విశ్వక్. కానీ వెనక బ్యాక్ గ్రౌండ్ లో మాన్షన్ బోటిల్ మూత తీసిన చప్పుడు వినిపించేసరికి "ఆ మాకు అర్ధమయ్యింది" అంది సుమ..కానీ మీ ప్రేమలు చూస్తుంటే నాకు చాలా కుళ్ళుగా ఉంది" అంది సుమ. సరే "ఒక్కసారి బాలకృష్ణ గారికి ఫోన్ కొడతారా" అని విశ్వక్ ని అడిగింది సుమ.