English | Telugu
Karthika Deepam2 : పూజ పూర్తిచేసిన కార్తీక్, దీప.. ఆపరేషన్ కి డబ్బులు ఇచ్చింది ఎవరో శ్రీధర్ చెప్పనున్నాడా!
Updated : Feb 10, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -277 లో.....శ్రీధర్ తన ఫ్రెండ్ కి కాల్ చేసి కావేరికి సంబంధించిన ఎఫ్ డి లు గురించి తెలుసుకుంటాడు. ఆమె యాభై లక్షలు డ్రా చేసిందని అతను చెప్పగానే.. శ్రీధర్ షాక్ అవుతాడు. కావేరి నా మాట దాటావ్.. మీ అందరికి ఎలా బుద్ది చెప్పాలో నాకు తెలుసు.. రేపు పూజకి పిలిచారు కదా వస్తా అని శ్రీధర్ అనుకుంటాడు. మరుసటి రోజు కార్తీక్ పూజకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తాడు. కార్తీక్, దీప లు పీటలపై కూర్చొని ఉంటారు. మీ పుట్టింటివారు. మీ కోడలు పుట్టింటి వారు బట్టలు పెట్టాలని అనగానే.. కాంచన బాధపడుతుంది.
మా అమ్మకి నేనే పుట్టిల్లు.. నేనే బట్టలు పెడతానని కార్తీక్ అనగానే ఒకసారి ఆలోచించండి అని అనసూయ, దీపలు అంటారు. అప్పుడే సుమిత్ర, దశరథ్ లు వస్తారు. వాళ్ళని చూసి అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు పిలిచావా అని కార్తీక్ అనగానే.. మీరే కావలసిన వాళ్ళను పిలవమని చెప్పారు కదా అందుకే పిలిచానని దీప అంటుంది. దశరథ్ ని చూసి కాంచన ఎమోషనల్ అవుతుంది. మేమే ఇద్దరి తరుపున పుట్టింటి వాళ్ళమని సుమిత్ర చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.అప్పుడే కావేరి ఎంట్రీ ఇస్తుంది. అందరు తనని చూసి షాక్ అవుతారు. ఈవిడ తనకి సవతి అంటూ అక్కడున్న వాళ్ళు అనుకుంటూ ఉంటే.. అందరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. తనని పిలిచి ఉండకూడద దశరథ్ అంటాడు. అప్పుడే శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. మీరు ఎందుకు వచ్చారని శ్రీధర్ ని కావేరి అడుగుతుంది.
శ్రీధర్ తన వెటకారపు మాటలతో అందరిని బాధపెడతాడు. ఆ తర్వాత సుమిత్ర, దశరథ్ లు కాంచనకి కార్తీక్, దీప లకి బట్టలు పెడతారు. పూజ పూర్తవుతుంది
సుమిత్ర, దశరత్ లు అక్కడ నుండి వెళ్ళిపోతారు. కార్తీక్ చిరాకుగా లోపలికి వెళ్తాడు. తన వెనకాలే శ్రీధర్ వెళ్తాడు. శ్రీధర్ తో కార్తీక్ గొడవపడతాడు. అసలు నీ కూతురు ఆపరేషన్ కి డబ్బు ఎవరు ఇచ్చారని శ్రీధర్ అనగానే.. ఒక మనసు ఉన్నవాళ్ళని కార్తీక్ అంటాడు. నేను చెప్పాలా అని శ్రీధర్ అనగానే.. దీప, కావేరీ ఇద్దరు టెన్షన్ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.