English | Telugu

Illu illalu pillalu : జాబ్ కి వెళ్తానని మామయ్యని ఒప్పించిన కోడలు.. తను కాలేజీకి వెళ్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -79 లో..... సాగర్, ధీరజ్ లు కలిసి చందు దగ్గరికి వచ్చి.. నీ కంటే ముందు మేం పెళ్లి చేసుకొని తప్పు చేసాం అన్నయ్య, మమ్మల్ని క్షమించమని బాధపడతారు. అవి అన్ని అనుకోకుండా అయిపోయాయి దాని గురించి బాధపడకండి అని తముళ్లిద్దరిని దగ్గరికి తీసుకుంటాడు చందు. మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని తిరుపతి అంటాడు.


మరుసటి రోజు నర్మద రెడీ అవుతుంది. ఎక్కడికి అని సాగర్ అడుగుతాడు. మా పుట్టింటికి అంటూ కాసేపు సరదాగా ఆటపట్టిస్తుంది. నిజంగానే సాగర్ టెన్షన్ పడుతూ ఇప్పుడు పుట్టింటికి ఏంటి నువ్వు లేకుండా నేను ఉండనని రిక్వెస్ట్ చేస్తాడు. మా పుట్టింటికి కాదు ఆఫీస్ కి అని చెప్తుంది.

నర్మద కిచెన్ లోకి వెళ్లి అక్కడున్నా వేదవతిని ఆఫీస్ కి వెళ్లడానికి పర్మిషన్ అడుగుతుంది. సరేనని వేదవతి అంటుంది. ఈ విషయం మావయ్యతో చెప్పి ఒప్పించండి అని నర్మద అనగానే.. ఎప్పుడు తెలివైన దానివి అనుకుంటావ్ కదా వెళ్లి నువ్వు ఒప్పించమని వెధవతి అంటుంది. నర్మద రామరాజుకి టీ తీసుకొని వెళ్లి.. మావయ్య ఆఫీస్ కీ వెళ్ళాలి.. మీరు పర్మిషన్ ఇస్తే అని అనగానే మీ జీవితానికి సంబందించి మీరు నిర్ణయం తీసుకున్నారు. వెళ్తే వెళ్ళు అనగానే థాంక్స్ మావయ్య అంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా వేదవతి చూస్తూ ఉంటుంది.

చందు, ధీరజ్ తో మాట్లాడతాడు. ఎన్ని రోజులు ఇలా ఉంటావ్.. కాలేజీకి వెళ్ళమని చెప్తాడు. మరొకవైపు నర్మద, వేధవతి లు ప్రేమ కాలేజీకి వెళ్ళడానికి ఒప్పిస్తారు. ఆ తర్వాత నర్మద ఆఫీస్ కి వెళ్తు వేదవతి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటంది. ప్రేమ కాలేజీకీ వెళ్లడానికి రెడీ అయి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.