English | Telugu
అయ్యయ్యో బ్రహ్మముడి సీరియల్ టైమింగ్ మార్చి ఎంత తప్పు చేశారో..స్టూడెంట్స్ ఆవేదన
Updated : Feb 11, 2025
స్టార్ మా సీరియల్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. చూసే కొద్దీ చూడబుద్దేసేలా ఉంటాయన్నమాట. ఐతే కార్తీక దీపం సీరియల్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో మీకు తెలుసు కదా. ఆ సీరియల్ ఐపోయాక ఆ సీరియల్ స్లాట్ లో బ్రహ్మముడి సీరియల్ ని తీసుకొచ్చారు. ఈ సీరియల్ సూపర్ గా ఉంది మంచి రేటింగ్ వస్తోంది అనుకుంటున్నా టైములో ఈ సీరియల్ టైం స్లాట్ ని మార్చేశారు. ఈ బ్రహ్మముడి సీరియల్ రాత్రి 7 .30 కి ప్రసారం అయ్యేది. గత ఏడాది నవంబర్ రెండో వారం నుంచి ఈ సీరియల్ మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం చేయడం స్టార్ట్ చేసింది.
మంచిగా రేటింగ్ వచ్చే సీరియల్స్ ని అలా ఉంచరు టైమింగ్స్ మార్చేసి కలగాపులగం చేసేసి మళ్ళీ కొన్ని రోజులు పోయాక మళ్ళీ పాత టైం స్లాట్ కి తీసుకొస్తారు. అప్పటికి ఆడియన్స్ అందరికీ కూడా చిరాకొచ్చేసి ఆ సీరియల్ ని చూడడమే మానేసే పరిస్థితికి వస్తుంది. ఐతే ఇప్పుడు దీని మీద ఒక ఫ్యాన్ చాలా బాధపడ్డారు. బ్రహ్మముడి సీరియల్ కావ్య అలియాస్ దీపికా కోయ అమ్మాయి గెటప్ లో ఒక ట్రెండింగ్ సాంగ్ కి డాన్స్ వేసిన రీల్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఐతే కావ్య డాన్స్ ని గెటప్ ని నెటిజన్స్ అంతా మెచ్చేసుకుంటున్నారు. ఐతే ఒక అభిమాని మాత్రం "బ్రహ్మముడి సీరియల్ టైమింగ్ మార్చేశారు. అక్కా సీరియల్ చూద్దాం అంటే కాలేజీ అడ్డొస్తోంది" అంటూ కామెంట్ చేశారు. మిగతా నెటిజన్స్ ఐతే "వస్తారు ట్రెండ్ సెట్ చేసి పోతారు.. దీపికా క్యూట్ లుక్" అంటున్నారు.