English | Telugu

విపుల్ కోసం బ్రహ్మముడి కావ్య ఉపవాసం

డాన్స్ ఐకాన్ సీజన్ 2 రీసెంట్ ఎపిసోడ్ ఫుల్ జోష్ తో సాగింది. ఐతే ఇందులో విపుల్ చేసిన డాన్స్ పీక్స్ లో ఉంది. అదొక డాన్స్ లా లేదు. ఒక మ్యాజిక్ లా అనిపించింది చూసే ఆడియన్స్ కి. ఐతే విపుల్ మెంటార్ ఐన బ్రహ్మముడి కావ్య విపుల్ తో చేసిన హంగామా మాములుగా లేదు. "నువ్వు దొరకడం నా అదృష్టం.. నా హార్ట్ ఫుల్ ఐపోయింది. గుండెను రాయి చేసుకుని విను. నీకు ఒక విష్యం చెప్తాను మళ్ళీ నువ్వు నా దగ్గర నుంచి వెళ్లిపోకూడదు. నాకు ఒక్క స్టెప్ డాన్స్ కూడా రాదు. ఇంతమంచి టాలెంటెడ్ పర్సన్ దొరికాక నేను రెండు మూడు పనులు చేయాలి.వారం వారం ఉపవాసం ఉండాలి. నీకు టైటిల్ రావాలని వ్రతం చేయాలి. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి గుండు కొట్టించుకుందాం ఇద్దరం. నేను చేయాల్సింది చేస్తాను. నువ్వు ఈ స్టేజి మీద డాన్స్ చెయ్యి అంతే." అని చెప్పింది. ఇక విపుల్ డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. చివరికి అతనికి బ్రాన్జ్ మెడల్ వచ్చింది. దాంతో శ్రీవల్లిలా ఫీలైపోయిన కావ్య విపుల్ గడ్డం దగ్గర దిష్టి చుక్క పెట్టి వెళ్ళిపోయింది. యష్ మాష్టర్ ఐతే కావ్యను చూసి "నువ్వు శ్రీవల్లి కాదు గోడ మీద బల్లిలా వెళ్లి విపుల్ ని అతుక్కుపోతున్నావ్" అంటూ సెటైర్ వేసాడు. ఇక బ్రహ్మముడి సీరియల్ స్టార్ మా మంచి రేటింగ్ సంపాదించుకుంది. ఐతే ఇందులో చేస్తున్న మానస్ - దీపికా ఇద్దరూ ఈ మధ్య అన్ని షోస్ కి ఈవెంట్స్ కి వస్తున్నారు. ఇక ఇప్పుడు ఇద్దరూ మెంటార్స్ గా డాన్స్ ఐకాన్ లో దంచి కొడుతున్నారు. కావ్య ఐతే ఇక ఏదనిపిస్తే అది మాట్లాడేస్తూ కామెడీ జెనెరేట్ చేస్తోంది. ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ జోడి మాత్రం బుల్లితెర మీద వేరే లెవెల్ లో దూసుకుపోతున్నారు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.