English | Telugu

Illu illalu pillalu : వాడి లొకేషన్ దొరికేసింది.. ప్రేమ, ధీరజ్ కలిసి కళ్యాణ్ ని వెతికి పట్టుకుంటారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -91 లో..... ప్రేమ, ధీరజ్ లు కలిసి కళ్యాణ్ గాడిని పట్టుకోవాలని ట్రై చేస్తారు. ప్రేమ పేరున సిమ్ తీసుకొని అందులో ఉన్న నంబర్స్ బ్యాకప్ చేసి కళ్యాణ్ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తారు. అందరు తమకి తెలియదని అంటారు. దాంతో ధీరజ్ తన ఫ్రెండ్ కి కాల్ చేసి కళ్యాణ్ నెంబర్ చెప్పి ట్రేస్ చేయమని చెప్తాడు.

ఆ తర్వాత ఇద్దరు అలిసిపోయి గుమ్మం ముందే ఒకరి భుజాలపై ఒకరు పడుకుంటారు. ప్రొద్దున లేచేసరికి కూడా అలాగే ఉండడంతో ఇంట్లో వాళ్ళందరూ వాళ్లిద్దరి చుట్టూ చేరతారు. ఇద్దరు నిద్ర లేచి ఒకరి మొహం ఒకరు చూసుకొని ఆశ్చర్యంగా లోపలికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ధీరజ్ ఫ్రెండ్ ఫోన్ చేసి కళ్యాణ్ అడ్రెస్ తెలిసిందని చెప్తాడు. ప్రేమ, ధీరజ్ లు ఇద్దరు వెళ్తుంటారు. ఎక్కడికి వెళ్తున్నారని వేదవతి అడుగగా.. కాలేజీకీ అంటూ కవర్ చేస్తారు.

మరొకవైపు రామరాజు, తిరుపతి లు బయటకు వెళ్తుంటారు. మిల్ కి వెళ్ళాలని లేదంటూ రామరాజు ఒక టీ స్టాల్ దగ్గర ఆగి టీ తాగాలని అనుకుంటాడు. అక్కడున్న జనాలు అందరు మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారట అని అనగానే అవమానంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ప్రేమ, ధీరజ్ లు కళ్యాణ్ ని పట్టుకోవడానికి వెళ్తారు. ఇద్దరు బస్ లో వెళ్తారు. ప్రేమ వంథింగ్ చేసుకుంటుంటే ధీరజ్ వెళ్లి వాటర్ ఇస్తాడు. ప్రేమ, ధీరజ్ లు లోపలకీ వచ్చాక బస్ లో ఒక బామ్మ ప్రేమ నాడి పట్టుకొని చూస్తుంది. ఎందుకు ఇలా చూస్తున్నారని ప్రేమ అడుగుతుంది. నెల తప్పవేమో అని బామ్మా అనగానే.. ప్రేమ, ధీరజ్ లు షాకింగ్ గా చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.