English | Telugu

ఆర్జే కాజలా మాజాకానా..ఆస్కార్ అవార్డుకె గేలం వేసింది..


ఆర్జే కాజ‌ల్ అంటే తెలియని వాళ్లుండరు. ఆర్జేగా రేడియోలో గ‌ల గ‌ల మాట్లాడుతూ శ్రోత‌ల‌ను ఉర్రూతలూగిస్తూ ఉంటుంది. అంతే కాదు డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంక‌ర్ గా షోస్ చేస్తూ ఉంది. అలాగే బిగ్ బాస్ సీజ‌న్ - 5కి వెళ్లి ఫేమ‌స్ అయ్యింది. ఎన్నో సీరియల్స్ కి డబ్బింగ్ చెప్పింది. అలాగే ఎక్స్పోజ్డ్ అనే వెబ్ సిరీస్ లో అద్భుతంగా నటించింది. అలాంటి కాజల్ బుల్లితెర మీద ఎన్నో షోస్ కి వస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంది. రీసెంట్ గా సుమ అడ్డా షోకి కూడా వచ్చింది. శివరాత్రి స్పెషల్ గా ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. రాగానే అందరికీ పులిహోర ఇచ్చింది సుమా. ఇక ఈ షోకి మహేష్ విట్టా, శ్వేతా వర్మ, నటరాజ్ మాష్టర్, ఆర్జే కాజల్ వచ్చారు.

వీళ్లందరినీ ఒక ప్రశ్న కూడా అడిగింది. "ఒకవేళ శివుడు ప్రత్యక్షమయ్యి ఏదైనా వరం కోరుకోమంటే మీరేం కోరుకుంటారు" అని అడిగింది. "ఒక వీక్ వరకు నేను ఎవరికీ కనబడకూడదు" అని నటరాజ్ మాష్టర్ చెప్పేసరికి "దానికి దేవుడు ఎందుకు సెల్ పట్టుకుని కూర్చుంటే మీరు ఎవరికీ కనపడరు" అంటూ కాజల్, సుమ చెప్పారు. తర్వాత కాజల్ తన కోరిక చెప్పింది.."అంటే ఇప్పుడిప్పుడే యాక్టింగ్ లోకి అరంగేట్రం చేసాను కాబట్టి ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుంటాను" అని చెప్పింది. దానికి సుమ "చూసారా రాజమౌళి గారు..మీరు ఒక జనరేషన్ ని ఎలా పాడు చేసారో..మీకు అర్ధమవుతోందా ఇదంతా మీరు చేసిందే అని" అంటూ రాజమౌళి మీద సెటైర్స్ వేసింది సుమ . అంటే ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీస్లోని "నాటు నాటు" సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇక సుమ కూడా ఈ విషయాన్నీ ప్రస్తావిస్తూ చెప్పింది. ఇక మహేష్ విట్టా ఐతే "దేవుడు నాకు డే అండ్ నైట్ షూట్స్ వచ్చేలా చేయాలి..కళ్ళు తిరిగి కింద పడిపోయేలా చేతినిండా షూట్స్ ఉండాలి" అన్నాడు. "మంచి కొరికే కానీ కళ్ళు తిరిగి పడిపోవాలి అన్న లైన్ మాత్రమే దేవుడు వింటే ప్రాబ్లమ్ అవుతుంది" అని సెటైర్ వేసింది సుమ. ఇక శ్వేతా వర్మ ఐతే తన ఫాదర్ తో కలిసి వరల్డ్ టూర్ కి వెళ్ళాలి అని కోరుకుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.