English | Telugu

రాజ్ కి వ్యతిరేకంగా సాక్ష్యాలు.. కోర్టు తీర్పు ఏంటంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -652 లో.... అనామిక ఇచ్చిన కంప్లైంట్ తో రాజ్ ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంది అప్పు. దాంతో రాజ్ ఏ తప్పు చెయ్యలేదని ఇంట్లో వాళ్ళు బాధపడుతుంటారు. వాళ్ళు అలా బాధపడుతుంటే అనామిక రాక్షసనందం‌ పొందుతుంది. మరొకవైపు రాజ్ అరెస్ట్ గురించి కనకంకి ఫోన్ చేసి చెప్తుంది స్వప్న. రాజ్ ని అరెస్ట్ చెయ్యడం లో అప్పు ఇబ్బందిగా ఫీల్ అయింది కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ల దృష్టిలో చెడ్డది అయిందని స్వప్న చెప్తుంటే.. నేను వస్తానని కనకం అంటుంది. ఇప్పుడే వద్దని స్వప్న చెప్తుంది.

కావ్య, సుభాష్ లు రాజ్ ని కలవడానికి స్టేషన్ కి వెళ్తారు. రాజ్ ఇంటరాగేషన్ లో ఉన్నాడని అక్కడి కానిస్టేబుల్ చెప్తాడు. రాజ్ ని అప్పు ఇంటరాగేషన్ చేస్తుంది. ఒకవైపు రాజ్ తో మాట్లాడేటప్పుడు.. బావ ఏ తప్పు చెయ్యలేదని బాధపడుతూనే మరొకపక్క తన డ్యూటీ తను చేస్తుంది. రాజ్ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అప్పుకి చెప్తాడు. ఆ తర్వాత అప్పు బయటకు వస్తుంది. ఏం జరిగింది అప్పు అంటూ కావ్య అడుగుతుంది. ఇప్పుడేం చెప్పలేను కానీ బావ ఏ తప్పు చెయ్యలేదు.. బావకి ఫేవర్ గా ఒక ఆధారం దొరికిన చాలని అప్పు అంటుంది. కావ్య, సుభాష్ లు రాజ్ దగ్గరికి వెళ్తారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగింది. ఆ అనామికపై డౌట్ ఉందని కావ్యతో రాజ్ చెప్తాడు. మిమ్మల్ని బయటకు తీసుకొని వస్తానని కావ్య అంటుంది. కావ్య, సుభాష్ లు బయటకు వస్తుంటే అక్కడ అనామిక ఉంటుంది.

నాకు కాబోయే భర్తని చంపేశాడు.. అతన్ని ఎవరు కాపాడలేరని అనామిక అంటుంది. నా భర్త ఎప్పుడు అలా తప్పు చెయ్యడు.. నిజాలు త్వరలోనే బయట పెడుతానని అనామికకి కావ్య సవాలు విసురుతుంది. ఆ తర్వాత అప్పు ఇంటికి వచ్చాక రాజ్ ని ఎందుకు అరెస్ట్ చేసావంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మి లు విరుచుకుపడతారు. తరువాయి భాగం లో కోర్ట్ లో రాజ్ కి అప్పొజిట్ గా అనామిక లాయర్ మాట్లాడతాడు. అన్ని సాక్ష్యాలు రాజ్ కి అగేనెస్ట్ గా ఉంటాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.