Illu Illalu pillalu: చందుని శ్రీవల్లి నిజంగానే ప్రేమిస్తుందా.. రామరాజు ఫుల్ హ్యాపీ!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లాలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-120లో.. భాగ్యం తన కుటుంబాన్ని తీసుకొని గుడికి వెళ్తుంది. ఇక నీ పెళ్లి ఆగదని శ్రీవల్లితో భాగ్యం అంటుంది. మరి పెళ్ళి చేయాలంటే ధనలక్ష్మి కావాలి కదా అని భాగ్యం భర్య అడుగగా.. ఓస్ అదా.. మన అమ్మాయి పెళ్ళికి కర్త,కర్మ,క్రియ అన్నీ మన అల్లుడు గారే అని భాగ్యం అంటుంది. అమ్మోయ్.. పాపమే.. బావ వట్టి అమాయకుడే.. ఆయన నాకు చాలా బాగా నచ్చారు. నాకు తెలియకుండానే ఇష్టం పెంచుకున్నాను. ఆయనతో నా పెళ్లైతే నా జీవితం బాగుంటుందనే నమ్మకంతో ఉన్నానే.. అట్టాంటి మనిషిని మోసం చేయడం తప్పు కదమ్మా అని శ్రీవల్లి అంటుంది. అస్సలు తప్పుకాదే అమ్మడూ.. నీకు పెళ్లి సంబంధం చూసినప్పుడే నీకు క్లియర్‌గా చెప్పా.. మీ అయ్యని నేను పెళ్లి చేసుకుని నేను బతుకుతున్న దరిద్రపు బతకుని బతకనీయను అని.. అందుకోసం నేను వంద అబద్ధాలు చెప్పడానికైనా వెయ్యి మోసాలు చేయడానికైనా వెనకాడనని భాగ్యం తల్లి ప్రేమని చెప్పుకొస్తుంది.