English | Telugu

Karthika Deepam 2 : గౌతమ్ ని రెచ్చగొట్టిన జ్యోత్స్న.. ఏకమైన కార్తీక్, దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2' (Karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -324 లో... కార్తీక్, దీప ఇద్దరు మాట్లాడుకుంటారు. నేను మీ ప్రాణాలు కాపాడితే మీరు నా జీవితాన్ని కాపాడారు.. ఈ గడ్డి మొక్కను తులసి మొక్కను చేశారు. చిన్నప్పుడు మా నాన్న ఎప్పుడూ అనేవారు.. మనిషి ఎప్పుడూ ఒంటరి వాడు కాదు.. పంచభూతాలు మనతో ఉండి మనల్ని నడిపిస్తాయని.. నేను మిమ్మల్ని ఎన్ని మాటలన్నా భూదేవిలా ఓర్చుకున్నారు.. సమస్యల్లో చిక్కున్నప్పుడు ఆకాశంలా నిలబడ్డారు. ఈ తాళిని నా మెడలో కట్టి మైలపడిన గుడిని గంగాజలంతో కడిగేసినట్లు నా బతుకుని శుద్ధి చేశారు. నా గుడిలో మీరు చేరి, మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నారు.. దీపగానే మిగిలిపోయిన నా జీవితాన్ని దీపంగా వెలిగించి.. మీ పేరు పక్కన చోటు ఇచ్చి నన్ను ‘కార్తీకదీపం’ చేశారు అని దీప అంటుంది. ఇంకో జన్మ ఉందో లేదో నాకు తెలియదు. మనం మాత్రం భార్యభర్తలుగా ఉన్నంత వరకు కలిసే ఉంటాం దీపా.. నా నుంచి వెళ్లిపోతా అని ఎప్పుడూ అనొద్దంటాడు కార్తీక్.

దీప చేతుల్ని పట్టుకుని.. ప్రాణాలు కాపాడిన నీ చేతుల్ని ప్రాణం ఉండగా దూరం చేసుకోలేనని కార్తీక్ అనగానే.. దీప మురిసిపోతుంది. నువ్వు నేను అన్న ఆలోచన ఎప్పుడూ రానివ్వద్దు దీపా.. మనిద్దరం ఒక్కటే.. మనది ఆ దేవుడు ముడి వేసిన బంధం.. అందుకే ఈ కోనేటిలో మునిగిపోకుండా నిన్ను పంపాడని కార్తీక్ అంటాడు. ఇక ఏది ఎదురయినా కలిసి పోరాడుదాం.. గెలుద్దామని దీపతో కార్తీక్ అంటాడు.

ఇదిగో దీపా నీ లాకెట్ మళ్లీ నీ దగ్గరకే వచ్చేసింది. దీన్ని నీ దగ్గరే ఉండనీ అంటాడు కార్తీక్. వెంటనే దీప చేయి చాపుతుంది ఇవ్వమని. వెంటనే కార్తీక్.. ఇన్నేళ్లు కష్టపడి దాచింది చేతికి ఇవ్వడానికి కాదు.. మెడలో వేయడానికి.. ప్రాణదాత నా భార్యవు కాకపోయి ఉంటే చేతికే ఇచ్చేవాడ్ని.. ఇక సర్వం నువ్వే.. సర్వస్వం నువ్వే.. మూడు ముళ్లు ఎలాగో నీకు ఎదురుపడి వేయలేదు కదా? కనీసం ఈ లాకెట్ అయిన నీకు ఎదురుగా నిలబడి వేస్తానంటూ మెడలో తాళి కట్టినట్లే లాకెట్ వేస్తాడు కార్తీక్. దీప మురిసిపోతూ కార్తీక్ కళ్ళల్లోకి చూస్తుంది. ఇది నీ మెడలోనే ఉండనీ దీపా అని కార్తీక్ అంటాడు. అయితే దీప కూల్‌గా.. లేదు బాబు ఇది అంటే శౌర్యకు చాలా ఇష్టం.. దానికే ఇస్తాను.. గుర్తుగా ఉంటుంది. ఈ లాకెట్ మా అమ్మది.. మా నాన్న మా అమ్మ గుర్తుగా ఉండాలని దీన్ని నా మెడలో వేశారని దీప అంటుంది.

మరొక వైపు జ్యోత్స్న గౌతమ్ లు కలుస్తారు. జ్యోత్స్న తనని అడ్డు పెట్టుకొని దీప మీద గెలవాలని చూస్తుంది. నీపై అంత నింద వేసింది.. అది నేను నమ్మనంటూ దీపపై కోపం వచ్చేలా గౌతమ్ తో జ్యోత్స్న మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.