English | Telugu

Brahmamudi: రాజ్ ని చూసేసిన దుగ్గిరాల కుటుంబం.. అతను కాదని కావ్య చెప్పనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-689 లో.. ఇంట్లో కావ్య పూజ చేసి అందరికి హారతి అందిస్తూ.. అత్తయ్యా మీరంతా ఇంకా రెడీ కాలేదా అని అంటుంది. ఎందుకమ్మా అని ఇందిరా దేవి అనగానే.. అదేంటి అమ్మమ్మా ఈ రోజు శ్రీరామనవమి కదా.. మనం అంతా గుడికి వెళ్లి పూజలు చేయించే వాళ్లంగా అని కావ్య అంటుంది. ప్రతి సంవత్సరం అంటే రాజ్ చేతుల మీదుగానే చేయించేవాళ్లం. లాస్ట్ ఇయర్ మా వదిన గొప్పలకు పోయి నా కొడుకు కోడలు అంటూ మీ ఇద్దరి చేత ఆ పూజలు చాలా గ్రాండ్‌గా జరిపించింది.. ఇప్పుడు రాజ్ లేకుండా ఆ గుడికి వెళ్తే నీ కొడుకు ఎక్కడా అని అక్కడి వాళ్లు అడిగితే వదిన ఏమని సమాధానం చెబుతారని రుద్రాణి అంటుంది. ఆ సమాధానాలు ఏవో నేను చెప్పుకుంటాను.. గుడిలో పూజారి గారికి మనం వస్తున్నట్లు చెప్పేశాను. మనం కూడా అక్కడికి వెళ్దామని కావ్య అంటుంది. వెంటనే రుద్రాణీ.. ఎందుకు రాజ్ బతికే ఉన్నాడని మమ్మల్ని పిచ్చివాళ్లను చేసినట్లు అక్కడి వాళ్లని కూడా పిచ్చివాళ్లను చేయడానికా.. మేమంటే ఇంట్లో వాళ్లం.. బయటి వాళ్లకు ఆ కథలు చెబితే నమ్మరు.. పిచ్చదానివి అనుకుంటారని రుద్రాణి అంటుంది.

హాల్లో.. అప్పూ, కవి, రుద్రాణీ, రాహుల్, ప్రకాశం, ధాన్యం, ఇందిరాదేవి, సీతారామయ్య, స్వప్న, అపర్ణా దేవి, సుభాష్.. అంతా ఉంటారు. కావ్య మాటలను కొందరు వింటారు కావ్య తరపునే మాట్లాడతారు. కొందరు వాదిస్తారు. అక్కా.. నువ్వు రాహుల్‌ని తీసుకునిరా .. అంతా భార్యభర్తలు అక్కడ కళ్యాణం చేయిస్తే మంచిది కదా.. అక్కడ అందరికి నేను సమాధానం చెబుతాను.. ఈ కళ్యాణం జరిపిస్తున్నదే ఆయన ఇంటికి రావాలని అని స్వప్నతో కావ్య అంటే.. రాహుల్ కూడా అందుకుంటాడు. నీలా మేము పిచ్చివాళ్లం కాలేం.. నేను రానని అనేసి రాహుల్ ఆగిపోతాడు. మిగిలిన వాళ్లంతా కావ్య మాట నమ్మి కావ్యతో పాటు వస్తారు. ఇక మరోవైపు యామినీ, వైదేహీ, రఘునందన్ ముగ్గురు కూడా శ్రీరామనవమికి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతారు. ఇక రాజ్ కూడా రెడీ అయ్యి కిందకు రాగానే.. గుడికి వెళ్దాం రా బావా.. ఈ రోజు మనం శ్రీరామనవమిలో రాముల వారి పెళ్లిని జంటగా చూస్తే మన పెళ్లి త్వరగా అవుతుందని మమ్మీ మొక్కుకుందట అంటూ రాజ్‌ని ఒప్పించి.. దుగ్గిరాల వారు వెళ్లిన గుడికే తీసుకుని వెళ్తారు. అయితే రాజ్ మనసులో కావ్య గురించే ఆలోచిస్తాడు. ఈరోజు తనని కలవాలి అనుకున్నాను కానీ ఇలా ఇరుక్కున్నానని రాజ్ బాధపతాడు.

అప్పుడే యామినీ, రాజ్ వాళ్లు ఆ గుడి ముందు కారు దిగుతారు. కావ్య గురించే రాజ్ తపిస్తూ ఉంటాడు. ఇక గుడిలోపల పంతులు పీటలు ఏర్పాటు చేయించి... దంపతులు కూర్చోండి, కళ్యాణం చేయిద్దాం అన్నప్పుడు.. నేను ఆయనతో కలిపి కూర్చుంటానని కావ్య అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ కావ్య అంటూ రుద్రాణి తిడుతుంది.. అప్పుడు కూడా కావ్య మాటకే సపోర్టుగా ఇందిరాదేవి నిలబడుతుంది. ఇప్పుడే వస్తానని కావ్య పక్కకు వెళ్లి రాజ్ ఫొటో పట్టుకుని ఎంట్రీ ఇస్తుంది. అప్పటికే అపర్ణా, సుభాష్‌తో పాటు కవి, అప్పూ కూడా పీటల మీద కూర్చుంటారు. తరువాయి భాగంలో రాజ్ ఫోటోతో కావ్య ముందు వరుసలో కూర్చుంటే రాజ్ ఏమో చివరి వరుసలో యామినితో ఉంటాడు. అప్పుడే బయట నుండి వచ్చిన రుద్రాణి.. చివరి వరుసలో యామిని పక్కన రాజ్ ని, ముందు వరుసలో కావ్య పక్కన ఫోటోలో రాజ్ ని చూసి ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.