English | Telugu

చనిపోయేలోపు ఒక్కసారైనా నేను ఇలా...


బ్రహ్మముడి సీరియల్ ద్వారా దీపికా రంగరాజు తెలుగు ఆడియన్స్ ని అలరిస్తోంది.ఆమె అల్లరి గురించి మాటల్లో చెప్పడం కంటే షోస్ లో చూస్తే చాలు. ఏ షో చేసిన ఆ షో ప్రోమోలో హైలైట్ అయ్యేది దీపికా మాత్రమే. అలా చేస్తుంది అల్లరి. బ్రహ్మముడి సీరియల్ తో పాటు డాన్స్ ఐకాన్ షోకి మెంటార్ అలాగే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే షోలో సమీరా భరద్వాజ్ కి జోడి కంటెస్టెంట్ గా చేస్తోంది. అలాంటి దీపికా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైమింగ్ ఉన్న లేడీ ఆర్టిస్ట్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టింది. అది చాలా వెరైటీగా ఉంది. "నా జీవితంలో చనిపోయేలోపు ఒక్కసారైనా నేను ఇలా రైడ్ కి వెళ్ళాలి అనుకుంటున్నా..దీన్ని మంగోలియా గ్రాస్ స్లైడ్" అంటారు అని పోస్ట్ చేసింది.

ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియాలోని హులున్‌బుయిర్ ప్రైరీ దగ్గర 1,200 మీటర్ల పొడవైన గడ్డి స్లైడ్స్ కనిపిస్తాయి. ఏదైనా సరే పచ్చగడ్డిని చూసినప్పుడు వచ్చే ఆనందం కానీ ఆ ఎనెర్జీ కానీ ఎందులోనూ దొరకదు. మనం చెట్లను కొట్టేస్తుంటే మిగతా దేశాల్లోని వాళ్లంతా గడ్డిని, చెట్లను పెంచి ప్రకృతిని కాపాడుతూ ఉన్నారు. ఇప్పుడు దీపికా కూడా అలాంటి గడ్డిలో కాసేపు అలా స్లైడ్ చేస్తూ ఎంజాయ్ చేయాలని ఆశపడుతోంది. దీపికా ఎక్కువగా మానస్ తో కలిసి షోస్ కి వెళ్తూ ఉంటుంది. ఐతే ఈమె తెలుగు వలన షోస్ లో ఉన్నవాళ్లు ఆ మాటలను అర్ధం చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఆమె ఉంటె మాత్రం ఆ షో రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని ఆలోచనతో ఆమెను ఎక్కువగా షోస్ కి పిలుస్తున్నారు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.