English | Telugu

రోజా నీతో పెట్టుకుంటే... నా బతుకు జట్కాబండి ఐపోతుంది

డ్రామా జూనియర్ సీజన్ 8 లో జగపతిబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఆ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో జగపతి బాబు, ఆమని, రోజా అంటే శుభలగ్నం మూవీ టీమ్ వచ్చింది. ఇక ఆమని ఆ సినిమాలో లాగే జగపతి బాబు స్టేజి మీదకు రాగానే "పొరుగింటి మంగళ గౌరీ" సాంగ్ పాడింది. "పక్కింటి వరలక్ష్మి వాళ్ళ ఆయన వారానికి ఒక సారి సినిమాకు తీసుకెళ్తాడట" అని చెప్పింది. "అవును నేను వాళ్ళ ఆయన్ని అడిగాను కానీ ఆయన ఒప్పుకోలేదు" అన్నాడు జగపతి బాబు. ఇక ఇంకో అమ్మాయిని చూస్తూ "మేడలో బంగారు గొలుసు ఎంత బాగుందండి" అని ఆమని అనేసరికి "మెడ చూసా చాలా బాగుంది" అన్నాడు. " ఆ శుభలగ్నంలో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానా అండి" అని అడిగింది.

"అప్పుడు ఎలా ఉన్నవో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావ్ నువ్వు వేసుకున్న జుట్టు రంగు మీద ఒట్టు" అన్నాడు. తర్వాత రంగంలోకి రోజా ఎంట్రీ ఇచ్చింది. "అప్పుడు శుభ లగ్నంలో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానా"అని అడిగింది. ఇప్పుడు నిన్ను ఏమన్నా అన్నాననుకో నా బతుకు జట్కా బండి ఐపోతుంది" అని జగపతి బాబు బయపడిపోయాడు. రోజా రాగానే బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ మీద "బతుకు జట్కాబండి" షో వేశారు. దాంతో జగపతి బాబు అలెర్ట్ అయ్యాడు. శుభలగ్నం రిక్రియేషన్ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా శుభలగ్నం మూవీ మాత్రం అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. ఇక ఆమని, రోజా ఐతే ఎంతో అమాయకమైన రోల్స్ లో నటించారు. ఈ మూవీతోనే వీళ్ళ ముగ్గురికి మంచి బ్రేక్ వచ్చింది. అప్పట్లో మిడిల్ క్లాస్ ఫామిలీ స్టోరీస్ కి ఆడియన్స్ అందులోనూ లేడీ ఆడియన్స్ ఐతే బ్రహ్మరధం పట్టేవాళ్ళు.


Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.