English | Telugu

Brahmamudi : అమ్మ పుట్టినరోజున కేక్ కట్ చేయించిన రాజ్.. యామిని షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -699 లో.. రాజ్, కావ్య ఇద్దరు పూజరి దగ్గరికి వస్తారు. ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు.. తన పేరు భానుమతి.. తన పేరున అర్చన చెయ్యండి అని పూజారికి రాజ్ చెప్తాడు. గోత్రం చెప్పండి అని పూజరి అనగానే నా చిన్నప్పుడు అమ్మ, నాన్న చనిపోయారు.. నాకు గోత్రం తెలియదని రాజ్ అనగానే దూరం నుండి అదంతా చూస్తున్న అపర్ణ బాధపడుతుంది.

మరొకవైపు బావ ఇంకా రావడం లేదేంటి.. ఒకవేళ ఎవరైనా కలిసారా.. లేక ఎవరినైనా కలవడానికి వెళ్లాడా అని వైదేహితో యామిని అంటుంది. ఆ తర్వాత రాజ్ , కావ్య కలిసి అన్నదానం చేస్తారు. నా కొడుకు నా కోసం అన్నదానం చేస్తుంటే.. నేను ఎందుకు దూరంగా ఉండాలని అపర్ణ వెళ్లి భోజనానికి కూర్చుంటుంది‌. అపర్ణని చూసిన రాజ్.. ప్లేట్ పెట్టి భోజనం వడ్డీస్తాడు. ఈ రోజు నా పుట్టినరోజు కూడా అని అపర్ణ చెప్పగానే.. అపర్ణని విష్ చేస్తాడు రాజ్. ఇక అలా రాజ్ తో మాట్లాడుతూ అపర్ణ మురిసిపోతుంది.

ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి. ఆవిడ పుట్టినరోజు కూడా ఈ రోజే అంట పాపం.. తన కొడుకు దూరం గా ఉన్నాడటా.... ఒకపని చేద్దామా మా అమ్మ పుట్టినరోజు.. తన పుట్టినరోజు ఒకేరోజు కాబట్టి అవిడ చేత కేక్ కట్ చేయిద్దామని రాజ్ అనగానే కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రాజ్ అపర్ణ దగ్గరికి వచ్చి మీతో కేక్ కట్ చేయిద్దామనుకుంటున్నామని అనగానే అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో అపర్ణ చేత రాజ్ కేక్ కట్ చేయిస్తాడు. అక్కడికి యామిని వచ్చి ఎవరు ఈమె అని అపర్ణని ఉద్దేశించి అడుగుతుంది. అమ్మ అని రాజ్ అనగానే యామిని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.