English | Telugu

‘సారంగపాణి జాతకం’మూవీ హీరోయిన్  రూపా కొడువాయుర్.. పట్టిందల్లా బంగారం


సారంగపాణి మూవీ టీమ్ లో హీరోయిన్ రూపకి మంచి కితాబిచ్చాడు ప్రియదర్శి. డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఈ వారం ఎపిసోడ్ ఈ మూవీ నుంచి డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ, ప్రియదర్శి, రూప వచ్చారు. వీళ్ళు రాగానే స్టేజి మీద ముమైత్ ఖాన్ కంటెస్టెంట్ అన్షికా వచ్చి "అహ నా పెళ్ళంటా" అంటూ మాయాబజార్ మూవీలోని ఓల్డ్ క్లాసికల్ సాంగ్ కి డాన్స్ చేసింది. ఆ డాన్స్ చూసాక అసలు ఇలాంటి డాన్స్ ని తన లైఫ్ లో చూడలేదు అంటూ ఓంకార్, ప్రియదర్శి, ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పుకొచ్చారు. తర్వాత సారంగపాణి మూవీ హీరోయిన్ రూపతో ఈ సాంగ్ కి డాన్స్ వేయాలని ఓంకార్ అడిగేసరికి దర్శి ఐతే ఆమెకు ధైర్యం చెప్పి వెళ్లి డాన్స్ చేసేసి రా అని చెప్పాడు. దాంతో ఆమె వెళ్లి డాన్స్ ఇరగదీసింది. దాంతో ఇంద్రగంటి మోహనకృష్ణ చూసి చాలా ఫీలయ్యాడు. "ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నా.

సారంగపాణి మూవీ ముందు ఈ షోకి వచ్చి ఉంటె...ఇలాంటి ఒక డాన్స్ చేయగలదు రూప అని తెలిసి ఉంటె ఇలాంటి ఒక సాంగ్ ని పెట్టేసేవాడినేమో..నాలుగు పాటలున్న ఆల్బం ఐదు పాటలున్న ఆల్బం అయ్యేది. ఈ సినిమాలో రూప మాకు చేసిన అన్యాయం ఇదొక్కటే.. జోక్స్ పక్కన పెడితే రూప చాలా బాగా డాన్స్ చేసావ్ " అని మెచ్చుకున్నారు. దాంతో రూప "నెక్స్ట్ ఫిలింలో చేస్తా సర్" అంది. వెంటనే ప్రియదర్శి "చెప్పా కదా తెలుగు సాయి పల్లవిలాగా బాగా చేసినవ్..బాగా డాన్స్ వేసినవ్" అన్నాడు. సారంగపాణి మూవీ హీరోయిన్ రూప కొడువాయుర్ ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య మూవీలో ఆ తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీలో నటించింది. ఈమె క్లాసికల్ డాన్సర్ కూడా కావడంతో ఏ డాన్స్ ని ఐనా అవలీలగా వేసేస్తుంది. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలే లేరు అన్న మాటను పక్కన పెడితే రూప లాంటి తెలుగమ్మాయిలు డైరెక్టర్స్ కి బెస్ట్ ఆప్షన్ గా ఉన్నారిప్పుడు . వీళ్ళను చూసి ఇంకొంతమంది తెలుగమ్మాయిలు కూడా ఇండస్ట్రీలోకి నెమ్మది నెమ్మదిగా వస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.