English | Telugu

Illu illalu pillalu : శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ అమ్మడం చూసిన నర్మద.. భాగ్యం ఇంటికెళ్ళిన ప్రేమ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -147 లో.. చీర కట్టుకోవాలా డ్రెస్ వేసుకోవాలా అనే కన్ఫ్యూషన్ లో ప్రేమ ఉంటుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. దీనికి ఇంత ఆలోచించడం ఎందుకు సారీ అని సెలక్ట్ చేస్తాడు. ఆ తర్వాత ధీరజ్ రెడీ అయి వస్తాడు. ప్రేమ జాకెట్ హుక్స్ పెట్టడానికి నర్మదని పిలుస్తుంది. అయిన వాళ్ళు ఎందుకు వస్తారు ఏంటోనని ధీరజ్ అడుగుతాడు. ప్రేమ ఇబ్బంది పడుతూ జాకెట్ హుక్స్ అని చెప్తుంది.

సరే నేను పెడతాను అటు తిరుగమని ధీరజ్ అంటాడు. ప్రేమ తిరుగుతుంది. ఒకవైపు ధీరజ్ మరొకవైపు ప్రేమ ఇద్దరు సిగ్గుపడుతుంటారు. ధీరజ్ హుక్స్ పెడతాడు.మరొకవైపు శ్రీవల్లి అన్ని గిల్టీ నగలు బ్యాగ్ లో పెడుతుంది. అప్పుడే భాగ్యం ఫోన్ చేసి అన్ని సర్ధావా అని అడుగుతుంది. అన్ని సర్ధానని చెప్తుంది. అప్పుడే చందు వస్తాడు ఫోన్ లో మాట్లాడింది విన్నాడేమోనని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది కానీ చందు వినడు. బావ ఈ నగలన్ని మా అమ్మ లాకర్ లో పెట్టమంది అందుకే తీసుకొని వెళ్తున్నానని శ్రీవల్లి అనగానే సరే అని చందు అంటాడు. బావ ఈ మల్లె పులు నా తలలో పెట్టమని శ్రీవల్లి అనగానే చందు పెడుతాడు. అప్పుడే కామాక్షి వస్తుంది. దాంతో చందు సిగ్గుపడి వెళ్ళిపోతాడు. అమ్మ అందరిని బుట్టలో వేసుకోమంది కదా ఈవిడతో మొదలు పెడుదామని అనుకుంటుంది. ఇదిగోండి ఆడపడుచు కట్నం అంటూ ఒక గిల్టీ నగ కామాక్షికి ఇస్తుంది. అది చూసి కామాక్షి హ్యాపీగా ఫీల్ అవుతూ అందరికి చూపిస్తానంటూ వెళ్తుంది.

అయ్యో ఇప్పుడు దొరికిపోతానేమో అని శ్రీవల్లి బయపడుతుంది. మరొకవైపు శ్రీవల్లి నాన్న ఇడ్లీ అమ్ముతు ఉంటాడు‌. సాగర్, నర్మద వెళ్తుంటే ఇడ్లీ అమ్ముతున్న శ్రీవల్లి నాన్నని చూస్తుంది. శ్రీవల్లి వాళ్ళ నాన్న అని సాగర్ కి చెప్తుంది నర్మద. అయన ఇడ్లీ అమ్మడం ఏంటని సాగర్ అంటాడు. నర్మద, సాగర్ అతని దగ్గరికి వెళ్తుంటే అతను వాళ్ళని చూసి దాక్కుంటాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే తెలుస్తుంది కదా అని సాగర్ తో నర్మద అంటుంది. ఆ మాట విని శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తాడు. తరువాయి భాగంలో శ్రీవల్లి వాళ్ళు భాగ్యం ఇంటికి వెళ్తారు. శ్రీవల్లితో భాగ్యం మాట్లాడుతుంటే ప్రేమ వస్తుంది. ఎక్కడ వాళ్ళ మాటలు విందేమోనని వాళ్ళు భయపడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.