English | Telugu
Karthika Deepam2: జైలు నుండి ఇంటికొచ్చిన దీప.. శ్రీధర్ తిట్లు!
Updated : May 2, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -346 లో... దీపని ఇంటికి తీసుకొని వస్తాడు కార్తీక్. దీప ఇంటికి వస్తుందని తను వచ్చే దారిలో పూలతో డెకరేషన్ చేస్తుంది శౌర్య. ఇక దీప వచ్చి శౌర్యని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. నువ్వు వస్తున్నావని శౌర్య ఇదంతా చేసిందని కాంచన చెప్తుంది. దీప కి అనసూయ హారతి ఇచ్చి ఆహ్వానిస్తుంది. దీప లోపలికి వస్తుంది. కుబేర్ ఫోటో దగ్గరికి వచ్చి మొక్కుకుంటుంది. నాకు ఈ కుటుంబం కావాలి. ఎప్పుడు వీళ్ళతోనే ఉండాలని మొక్కుకుంటుంది.
మరొక వైపు దీపని అరెస్ట్ చేసిన ఇన్‌స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి జ్యోత్స్న కలుస్తుంది. రిపోర్ట్ చేంజ్ చెయ్యమంటే ఎందుకు చెయ్యలేదు.. డబ్బు తీసుకున్నావ్ కదా అని అడుగుతుంది. మాటలు మర్యాదగా రానివ్వండి. డబ్బు పంపాను చూడండి అని అతను అంటాడు. మా బావ ఎంత ఇచ్చాడు.. మా బావకి అమ్ముడు పోయావా అని జ్యోత్స్న అంటుంది. దాంతో ఇన్‌స్పెక్టర్ కూతురిని కార్తీక్ కాపాడి బ్లడ్ ఇచ్చిన విషయం గుర్తుచేసుకుంటాడు. వాళ్ళు మంచి వాళ్ళు వాళ్లకు అన్యాయం జరగొద్దని నేను రిపోర్ట్ మార్చలేదని ఇన్‌స్పెక్టర్ చెప్పేసి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత కావేరి డాన్స్ చేస్తుంటుంది. అప్పుడే శ్రీధర్ వచ్చి చూస్తాడు. ఏంటి ఇంత హుషారుగా ఉన్నావని అడుగుతాడు. అదేం లేదు మీరు రండీ అంటూ శ్రీధర్ ని కావేరి రూమ్ లోకి తీసుకొని వెళ్లి బయటనుండి లాక్ వేస్తుంది. కిటికీ దగ్గరికి వెళ్లి దీప బెయిల్ పై బయటకు వచ్చిందని చెప్పగానే శ్రీధర్ షాక్ అవుతాడు. నా కోడలిని కలవడానికి నేను వెళ్తున్నా మీరు వెనకాలే వస్తారని ఇలా చేసానని చెప్పేసి కావేరి వెళ్ళిపోతుంది. కాసేపటికి దీప దగ్గరికి కావేరి వెళ్తుంది. ఆయన వస్తే ఏదో ఒక గోడవ చేస్తారని లాక్ వేసి వచ్చానని కావేరి చెప్తుంది. అయిన వచ్చాను కదా అని శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. ఇక ఎప్పటిలాగే దీప తప్పు చేసిందని తిడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.