English | Telugu
ఇక్కడ 5 వేలు...అక్కడ 2 లక్షలు...టెక్నాలజీ అంటే ఇష్టం...
Updated : May 1, 2025
టాలీవుడ్ లో ఒకప్పుడు చక్రి ఆధ్వర్యంలో ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన కౌసల్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. "నీ కోసం" అనే మూవీతో ప్లే బ్యాక్ సింగర్ గా ఆమె కెరీర్ స్టార్ట్ చేసింది. క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా ఆమె అన్ని రకాల సాంగ్స్ పాడి అలరించారు. ఆ తర్వాత ఆమె ఇక పాడడం ఆపేసారు. రీసెంట్ గా ఇంటర్వ్యూలో సింగర్స్ రెమ్యూనరేషన్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు."ఫిలిం ఇండస్ట్రీ అనేది బిజినెస్. అందులో మన సౌత్ సైడ్ ఫిలిం ఇండస్ట్రీలో పేమెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ముంబైలో ఒక సింగర్ కి మినిమం 2 నుంచి 3 లక్షలు పే చేస్తారు. కానీ ఇక్కడ ఒక సింగర్ కి 5 వేలు మాత్రమే ఇస్తారు.
అది కూడా టాప్ పేమెంట్ అన్న లెక్కలో ఉంటుంది. నా కెరీర్ లో నేను తీసుకున్న హయ్యెస్ట్ పేమెంట్ 30 వేలు. కానీ ముంబై, చెన్నై నుంచి సింగర్స్ ని ఇక్కడికి రప్పించి పాటలు పాడించుకుంటే మాత్రం వాళ్లకు మాకంటే డబుల్ త్రిబుల్ పేమెంట్ ఇస్తారు. చెన్నైలో అంత పేమెంట్స్ ఎందుకు ఇస్తారు అంటే చెన్నై హెడ్ క్వార్టర్ కదా తెలుగు, తమిళ్ ఫిలిం ఇండస్ట్రీకి. ఇక హైదరాబాద్ అప్పుడప్పుడే చిన్న చిన్నగా ఎదుగుతోంది. ఐతే హైదరాబాద్ లో రికార్డింగ్స్ చేయడం అనేది ముందుగా ఎస్వి.కృష్ణ రెడ్డి గారు తీసుకొచ్చారు ముందుగా. మేము అప్పట్లో కోరస్ పాడేవాళ్ళం ఆ తర్వాత రమణ గోగుల గారు పాడారు. అలా స్టార్ట్ అయ్యింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ప్రస్తుతానికి నేను రిటైర్ ఐపోయాను. సింగర్స్ కి మేల్ సోలోస్ కి ఎక్కువ అవకాశం ఉంటుంది కానీ ఫిమేల్ సోలోస్ కి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా డ్యూయెట్స్ కి తీసుకుంటూ ఉంటారు. నేను శంకర్ మహదేవన్, హరిహరన్ వాయిస్ ని మిక్స్ చేసేదాన్ని. వాళ్ళ దాంట్లో కొన్ని లెటర్స్ తప్పులు వచ్చేవి. నాకు టెక్నాలజీ అంటే చాలా ఇష్టం అందుకే నేను టెక్నికల్ గా ఆ లెటర్స్ ని కరెక్ట్ చేసేదాన్ని పిచ్ కరెక్షన్స్ చేసేదాన్ని అది కూడా ఆ రోజుల్లో. నేను టెక్నాలజీలో అప్డేట్ గా ఉంటాను. కంపోజింగ్ అంటే ఇష్టం. నేనొక వ్లాగర్ ని. నా పాటను నేనే ఎడిట్ చేసుకున్నా..ఐఫోన్ తో షూట్ చేసుకుని, ఎడిట్ చేసుకుని ఒక మ్యూజిక్ వీడియోని రిలీజ్ చేసాను. "స్నేహమా" అని హిందీలో "మాహియా" అని ఈ టు సాంగ్స్ నేనే చేసాను." అంటూ తనలోని ఇంకో కోణాన్ని కూడా బయట పెట్టింది సింగర్ కౌసల్య.