English | Telugu
ఆది ఉంటే జబర్దస్త్ చేస్తా
Updated : May 1, 2025
బుల్లితెర మీద రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు షోస్ లో అప్పుడప్పుడు సీరియల్స్ లో జబర్దస్త్ లో కనిపిస్తూ అలరిస్తూ ఉండే అమ్మాయి. అలాంటి రీతూ లైఫ్ తన గోల్ ఏంటో సూటిగా చెప్పింది. "ముందు నేను ఈఎంఐలు క్లియర్ చేసుకుని హ్యాపీగా ఉండాలి. ఎక్కడైనా ఊరవతల ఒక చిన్న ఇల్లు కట్టుకుని రెండు బర్రెలు పెట్టుకుని వాటిని కాసుకుంటాను. ఎందుకంటే నాకు పెరుగంటే ఇష్టం. కర్డ్ రైస్ ఎక్కువగా తింటాను. బయట కొనుక్కుంటే వచ్చే పెరుగు నేచురల్ గా వచ్చే పెరుగు కావాలి..ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటాను.
కొన్ని కూరగాయ మొక్కలు వేసుకుని వాటిని పెంచుకుంటాను. చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటాను. ఏ బాధలు లేవు అన్నప్పుడు రోజూ వ్లాగ్స్ చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటా. జబర్దస్త్ లో ఇప్పుడు ఆది లేడు కాబట్టి చేయను..ఆది ఉంటే చేస్తా. ఐతే నేను ఆది టీమ్ లోకి ఎలా ఎంటరయ్యానంటే అప్పట్లో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి రామ్ ప్రసాద్ వీళ్లంతా ఫ్రెండ్స్. వీళ్ళు రామ్ మూవీలో నటిస్తున్నారు. ఆ పార్టీకి మా ఫ్రెండ్ నన్ను కూడా తీసుకెళ్లింది. రామ్ ప్రసాద్ కి పరిచయం చేసింది. అప్పుడు నేను చెప్పా ఇలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పాను. ఆ తరువాత రామ్ ప్రసాద్ ఫోన్ చేసి ఆది టీమ్ లోకి పర్సన్ కావాలి అని ఫోన్ నంబర్ ఇచ్చి చేయమని చెప్పాడు. అలా ఆది టీమ్ లోకి వెళ్లాను.జబర్దస్త్ లో అజర్ తో నాకు ఒక ట్రాక్ రన్ చేశారు. ఐతే అజర్ అంత ఫ్రెండ్లీ ఇష్టం అంతే. " అని చెప్పింది రీతూ చౌదరి.