English | Telugu

Brahmamudi : యామిని కావ్య మధ్య గొడవ.. వారిద్దరికి బ్రహ్మముడి పడనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -709 లో...... కావ్య రాజ్ ఇచ్చిన చీర కట్టుకొని మురుసిపోతుంది. అప్పుడే రాజ్ ఫోన్ చేస్తాడు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను పైగా మీ మావయ్య చూసాడు అన్నారు కదా ఏం అనలేదు కదా అని రాజ్ అడుగుతాడు. లేదండి మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని కావ్య చెప్తుంది. నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అవడమేంటని రాజ్ అడుగుతాడు.

అంటే మీరు నా ఫ్రెండ్ అని చెప్పాను కదా మీరు మావయ్యకి చాలా బాగా నచ్చారట అని కావ్య చెప్తుంది. నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందని రాజ్ అడుగగా.. చాలా బాగుందని కావ్య చెప్తుంది. మరుసటిరోజు ఉదయం కావ్య కిచెన్ లో వర్క్ చేస్తుంటే.. ఈ పనులు చేసుకుంటూనే ఉంటావా వెళ్లి రాజ్ తో మాట్లాడమని అపర్ణ చెప్తుంది. దానికి కావ్య సరే అంటుంది. ఆ తర్వాత మనం బయటకు వెళదాం బావ అని యామిని అంటుంది. సరే అని యామినితో రాజ్ వెళ్తుంటే.. కావ్య ఫోన్ చేసి కలవాలంటుంది. సరేనని రాజ్ అంటాడు. ఫ్రెండ్ ని కలవాలంటూ రాజ్ యామినికి చెప్పి కావ్యని మీట్ అవుతాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే యామిని చూస్తుంది. రాజ్ వెళ్ళిపోయాక కావ్యతో గొడవ పడుతుంది యామిని.

రాజ్ నా వాడు.. నీ కంటే ముందు రాజ్ నాకు తెలుసని యామిని అంటుంది. ఆయన చూసావ్ కదా నన్ను వదిలి ఉండడం లేదని కావ్య ఇద్దరు వాదించుకుంటారు. తరువాయి భాగంలో అన్నయ్య బ్రతికే ఉన్నాడని ఇంట్లో అందరికి కళ్యాణ్ చెప్తాడు. వెళ్లి తీసుకోద్దామని సీతారామయ్య అంటాడు. వద్దు కొన్ని రోజులు ఆగండి.. నేను ఆయన్ని మాములు మనిషిని చేసి తీసుకొని వస్తానని కావ్య చెప్తుంది. మరొకవైపు కావ్య రాజ్ ఫోటోతో ఉన్న వెడ్డింగ్ కార్డు యామిని రాజ్ కి ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.