English | Telugu

మా అమ్మే నాన్నలా నన్ను చూసుకుంది : గుప్పెడంత మనసు రిషి సర్

మదర్స్ డే స్పెషల్ గా "లవ్ యు అమ్మ" అనే షో త్వరలో స్టార్ మా ఆడియన్స్ కోసం రాబోతోంది. ఈ షోకి హోస్ట్స్ గా యాంకర్ రవి, విష్ణు ప్రియా వచ్చారు. "మన మొదటి ప్రేమ తన కౌగిలింత, మన మొదటి ముద్ద తన చేతి వంట..ఈరోజు ఈ స్టేజి అంతా అమ్మ ప్రేమతో నిండిపోతుంది" అంటూ ఇంట్రడక్షన్ ఇచ్చాడు రవి. ఈ షోకి గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముకేశ్ గౌడ, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్, బిగ్ బాస్ నుంచి ప్రేరణ, గౌతమ్ కృష్ణ, విజె సన్నీ, బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపికా ఇలా చాలామంది వచ్చారు. ఇక ఇమ్మానుయేల్ వాళ్ళ అమ్మ ఐతే విష్ణు ప్రియాకి కౌంటర్ ఇచ్చింది. "విష్ణు ప్రియా మేము మా పిల్లలతో వచ్చాము.

నువ్వు మీ పిల్లలతో రాలేదే" అని అడిగేసరికి ఆమె నోరెళ్లబెట్టింది. ఆ తర్వాత రవి "అమ్మ పాడిన జోల పాత ఎంతమందికి గుర్తుంది" అని అడిగాడు. అప్పుడు విజె సన్నీ భుజం మీద తల పెట్టి పడుకున్న వాళ్ళ అమ్మకు జోల పాడాడు "నంది కొండా వాగుల్లోనా" అంటూ దాంతో వాళ్ళ అమ్మ షాకయ్యింది. "మా అమ్మ గనక నాకు జోల పాట పాడితే నేను నిద్రపోను మా అమ్మే నిద్రపోతుంది" అని చెప్పింది దీపికా. ఇక అందరికీ ఇష్టమైన నటుడు ముకేశ్ గౌడ అలియాస్ రిషి సర్ వచ్చి మాట్లాడాడు " మా నాన్న రెండేళ్లు బెడ్ మీదనే ఉన్నారు. ఆ తర్వాత పారలైజ్ అయ్యాక ఇంట్లోనే తిరుగుతూ ఉండేవాళ్ళు. ఐతే ఒక ఏజ్ కి వచ్చాక ఫాదర్ సపోర్ట్ అనేది అవసరం అవుతుంది. మా అమ్మే నన్ను మా నాన్నలా చూసుకుంది. నెటిజన్స్ ఇక ముకేశ్ గౌడాని చూసి ఫుల్ ఫిదా ఐపోతున్నారు. రిషి సర్ ని పిలిచినందుకు ధన్యవాదాలు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.