English | Telugu

అటు మాస్ టచ్.... ఇటు క్లాస్ టచ్!

మార్చి 30వ తేదీన నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం విడుదల కానుంది. పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా విడుదలవుతోంది. ఈ చిత్రంతో నానీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు.  తాజాగా ట్రైలర్ కి బాగా హైప్  వచ్చింది. నాని కెరీర్ లో మొట్టమొదటిసారిగా పూర్తి మాస్ మసాలా క్యారెక్టర్ ను చేశారు. మాసిన గడ్డంతో లుక్కుతో గ్రామీణ యువ‌కుడిగా ర‌ఫ్ అండ్ ట‌ఫ్ పాత్ర‌లో  నాని క‌నిపిస్తున్నారు. నాని గ‌తంలో కృష్ణార్జున యుద్ధం, జెండాపై కపిరాజు, పైసా చిత్రాలలో మాస్ క్యారెక్టర్స్  ట్రై చేశారు.  కానీ అవన్నీ ఫ్లాప్ అయ్యాయి. కానీ దసరా పాత్ర మాత్రం అందరికీ బాగా కనెక్ట్ అయిందని చెప్పాలి. ఊర‌మాసుగా నాని కనిపిస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది....