English | Telugu

ఇలా హిట్ట‌యిన ప్ర‌తి చిత్రానికి సీక్వెల్ అంటే ఎలా?!

నేచురల్ స్టార్ నాని హిట్ మూవీలలో నేను లోకల్ ఒకటి.  ఇందులో నాని కి జోడీగా కీర్తిసురేష్ న‌టించింది. ఈ చిత్రానికి ధ‌మాకా ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌కుడు. ధ‌మాకాకి ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడే ఈ చిత్రానికి కూడా ప‌నిచేశారు. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన నేను లోక‌ల్ విజ‌యానికి చాలా కార‌ణాలు ఉన్నాయి. పెద్ద‌గా క‌థాబ‌లం లేక‌పోయినా ప‌నిపాటా లేకుండా బేవ‌ర్స్ గా తిరిగే హీరో క్యారెక్ట‌ర్ లో న‌టించిన నాని న‌ట‌నా ప్ర‌తిభ‌తో పాటు ప‌నిపాటా లేని బేవ‌ర్స్ అనే పాయింట్ నేటి యూత్ కి  బాగా క‌నెక్ట్ అయింది....

రాఖీ బాయ్ రావణుడు అంటే అభిమానులు ఒప్పుకోవడం లేదు!

కే జి ఎఫ్ చాప్టర్ 2 విడుదలై ఏడాది కావొస్తోంది . కానీ కె .జి. ఎఫ్ చాప్ట‌ర్ 1,  కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 ల  తర్వాత ఇందులో హీరోగా న‌టించిన రాఖీభాయ్ అలియాస్ య‌ష్  నటించిన మరో చిత్రం ఇప్పటివరకు అనౌన్స్ కాలేదు. ఆయన తదుపరిచిత్రం పై ఇప్పటివరకు క్లారిటీ లేదు. బర్త్‌డేకి కూడా ఏ సినిమా ప్రకటన చేయలేదు. ఏ సినిమాలకు ఆయన ఇంకా కమిట్ కాలేదు. అయితే ఓ చిత్రానికి ఆయన ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ ఫిలిం మేకర్ నితీష్ తివారి, మధు మంతెన, అల్లు అర‌వింద్ లు  తీయ‌నున్న  భారీ రామాయణం ప్రాజెక్టులో య‌ష్ ని  నటింపజేసేందుకు వారు సంప్రదించారు అని వార్తలు వస్తున్నాయి. రాముడి పాత్రకు గాను రణబీర్ కపూర్‌ను ఫైనల్ చేసిన టీం రావణుడి పాత్రకు య‌ష్ తో  సంప్రదింపులు జరిపారు అంటున్నారు...