English | Telugu

విభిన్న ద‌ర్శ‌కునితో విల‌క్ష‌ణ న‌టుడు!

కోలీవుడ్  తో పాటు టాలీవుడ్ లో కూడా హీరో సూర్యకు విలక్షణటునిగా ఒక పేరు ఉంది. ఆయన చిత్రాలు అంటే సంథింగ్ స్పెషల్ గా ఉంటాయని భావించేవారు ఎందరో ఉన్నారు. అందుకే ఆయన చిత్రాలకు తెలుగులో కూడా ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి. ఇటీవలే జై భీమ్, ఆకాశం నీ హద్దురా వంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకొని అవార్డులను కూడా సొంతం చేసుకున్న సూర్య ప్రస్తుతం శివా దర్శకత్వంలో ఓ పీరియాడికల్ హిస్టారికల్ మూవీ ని చేసే పనిలో ఉన్నారు.  అందులోనూ ఇప్పుడు ప్రేక్షకులందరూ ఓటీపీ ద్వారా ప్రపంచ సాయి కంటెంట్ కు బాగా దగ్గర అయిపోవడంతో పక్కా కమర్షియల్ రొటీన్ మాస్ మసాలా ఎంటర్టైన్ చిత్రాలను సూర్య దూరంగా పెడుతున్నారు.  ఏదో ఒక వైవిధ్యమైన పాయింట్ లేనిదే సినిమాలను ఒప్పుకోవడం లేదు. 

టైగర్ నాగేశ్వరరావు స్పెషల్ అట్రాక్షన్ అదేనంటున్నారు!

మాస్ మహారాజా రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే చిత్రం చేస్తున్నారు. దీని తరువాత అయినా స్టువ‌ర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో నటిస్తూ ఉండడం విశేషం. ఈ చిత్రం 1970 కాలంలో సాగుతుంది. దాన్ని బట్టి ఇది ఓ బ‌యోపిక్ మూవీగా రూపొంద‌నుంద‌ని అర్థమవుతుంది. ఈ చిత్రానికి భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు. ర‌వితేజ కెరీర్ లోనే అత్య‌ధిక బ‌డ్జెట్ తో రూపొందుతున్న చిత్రంగా దీనిని పేర్కొన‌వ‌చ్చు. మ‌రోవైపు ఈ మూవీ ర‌వితేజ కెరీర్‌లో  తొలి పాన్ ఇండియా మూవీగా  నిలవనుంది. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.