Read more!

English | Telugu

తమ్ముడు వస్తున్నాడు!

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ 'అమిగోస్' ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ రానున్నాడు. ఈ విషయాన్ని తాజాగా కళ్యాణ్ రామ్ స్వయంగా ప్రకటించాడు.

గత కొన్నేళ్లుగా తన అన్న కళ్యాణ్ రామ్ నటించిన ప్రతి సినిమా వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలో 'అమిగోస్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఎన్టీఆర్ వస్తాడని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ అధికారికంగా ప్రకటించారు. నేడు(శుక్రవారం) కర్నూల్ లో 'అమిగోస్' ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ఆదివారం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తమ్ముడు(జూనియర్ ఎన్టీఆర్) వస్తాడని, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందామని అన్నాడు.

'అమిగోస్' ఈవెంట్ కి ఎన్టీఆర్ వస్తున్నాడని తెలిసి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఆయన కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న తదుపరి సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ తన మూవీ లాంచ్, షూటింగ్ వివరాలు చెప్పేదాకా పట్టుబట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.