English | Telugu

ఆది పురుష్‌ గురించి సూపర్ లీక్ ఇచ్చిన జానకి!


ఆది పురుష్‌ సినిమా నాయిక జానకి అలియాస్ కృతి సనన్‌ సూపర్ లీక్ ఇచ్చారు. స్లోగా స్టడీగా ఫేమ్ సంపాదించుకుంటున్నారు కృతి సన‌న్‌. బ్రిలియంట్ టాలెంట్, ఎక్సలెంట్ యాక్టింగ్ స్కిల్స్ తో ఆమె తనకంటూ స్పెష‌ల్ క్రేజ్‌ ఏర్పరుచుకుంటున్నారు. ఆమె నటించిన షెహ‌జాద‌ సినిమా ఈనెల 17న విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కృతి సనన్‌.

ఆమె మాట్లాడుతూ ఆది పురుష్‌లో ప్రభాస్ పక్కన సీతగా నటించానని అన్నారు. ప్ర‌భాస్ చాలా మంచి వ్య‌క్తి అని చెప్పారు. ఈ సినిమా వేరే రేంజ్ లో ఉంటుందన్నారు కృతి సనన్‌. ఈ సినిమాలో నటించడం గర్వంగా అనిపిస్తుంది అని, ఈ సినిమా భారతీయ చలనచిత్రాలకు గర్వకారణం అని, ప్రేక్షకులకు కూడా అదే భావన కలుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు కృతి. రామానంద్ సాగర్ రామాయణాన్ని కృతి చూడలేదన్నారు. రామాయణం గురించి, ఇలాంటి కథలు పిల్లల్లో అవగాహన పెంచుతాయని చెప్పారు. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు పిల్లల్లో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుందని, కథల రూపంలో విన్నప్పుడు వాళ్లు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారని చెప్పారు. ఆది పురుష్‌ టీజర్ ఆ మధ్య విడుదలైంది. ఈ సినిమా వి ఎఫ్ ఎక్స్ బావుండలేదని ట్రోలింగ్ ఎదుర్కొంది. అందుకే విఎఫ్ఎక్స్ విషయం మీద ఎక్కువ కాన్సెంట్రేట్ చేయడానికి సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్. అన్నీ ప‌ర్ఫెక్ట్ గా జ‌రిగి ఉంటే, జనవరిలో సంక్రాంతి కానుకగా ఇప్పటికే విడుదల అయ్యేది ఆది పురుష్‌.

జూన్ 16న విడుదల చేయడానికి లేటెస్ట్ గా ఫిక్స్ అయ్యారు మేకర్స్. కార్తిక్ ఆర్య‌న్‌, కృతి నటించిన షెహజాదా సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. దీంతోపాటు ఆమె యాక్షన్ సినిమా గణపతిలో హీరోయిన్ గా నటిస్తున్నారు. షాహిద్ కపూర్ రోబోట్ రామ్ కామ్‌ లోను ఆమె కీలక పాత్రలో నటిస్తున్నారు. కరీనాకపూర్, టబు నటిస్తున్న క్రూలో కూడా కృతి కీల‌క పాత్ర చేస్తున్నారు.