English | Telugu

ఎస్ఎస్ఎంబి28 విషయంలో రోజుకు ఒకరి పేరు వినిపిస్తోంది!?

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎస్ఎస్ఎంబి 28 వర్కింగ్ టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా వంటి చిత్రాలు వచ్చాయి. హ్యాట్రిక్ మూవీ గా 12 ఏళ్ల తర్వాత ఈ కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇందులో హీరో హీరోయిన్లు కాకుండా ఓ కీలక పాత్ర ఉందట. ఈ పాత్ర కోసం మొదట ట‌బు పేరు వినిపించింది. ఆ తర్వాత ఐశ్వర్య రాయ్ పేరు వినిపించింది. మధ్యలో శోభన పేరు కొంతకాలం హడావుడి చేసింది. తాజాగా ఆ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ న‌టిస్తోంద‌ని టాక్ వినిపిస్తోంది.  పూజ హెగ్డే , శ్రీ‌లీలా  హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు నెగటివ్ రోల్ పోషిస్తున్నారు. దసరాకి ఈ సినిమా ధియేటర్ లోకి విడుదల కానుంది. 

మొత్తానికి ‘ఖుషి’ టీంకి గుడ్ న్యూస్ చెప్పింది!

సమంత హీరోయిన్‌గా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నిన్ను కోరి, మజిలీ వంటి చిత్రాల దర్శకుడు శివానిర్వాన దర్శకత్వంలో ఖుషి అనే చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే.  ఆయ‌న నానితో తీసిన ట‌క్  జగదీష్ తో పరాజయం చ‌విచూశారు. దాంతో ఎలాగైనా ఖుషీతో త‌న స‌త్తా మ‌రోసారి చాటాల‌ని చూస్తున్నారు. దాంతో ఈ మూవీపై ద‌ర్శ‌కుడు శివానిర్వణ  బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు. కానీ సమంతకు నాగచైతన్యతో విడాకుల తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లడం ఆ వెంటనే మయోసైటీస్ అనే వ్యాధి రావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. మరోపక్క సమంతా నటించిన శాకుంతల చిత్రం ఆమె పూర్తి చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. మ‌యోసైటిస్ నుంచి ఆమె కోలుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.... 

తరుణ్ భాస్కర్ ఈసారి హిట్టు కొట్టేలా ఉన్నారు!

అప్పటివరకు పెద్దగా ఎవరూ పట్టించుకోని విజయ్ దేవరకొండ తో పెళ్లి చూపులు చిత్రం తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈ చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అనే విభిన్న చిత్రం తీశారు. ఆ వెంటనే వెంకటేష్ తో సినిమా ఉంటుందని ప్రకటన వచ్చింది. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. కొంత విరామం తర్వాత తరుణ్ భాస్కర్ విభిన్న ప్రయత్నం చేస్తున్నారు. ఈ తాజా ఎంటర్టైనర్ పేరు కీడా కోలా. రాజమౌళి ఈగతో సినిమా సంచలనం సృష్టిస్తే తరుణ్ భాస్కర్ కీడా కోలా అంటే బొద్దింకతో సినిమా చేస్తున్నారు. ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్. అందరూ కొత్తవారు నటిస్తున్నారు...