English | Telugu

కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పిన నయనతార... వైరల్ అవుతున్న న్యూస్!

ప్రత్యేకంగా పరిచయం అక్కరలేని పేరు నయనతార. దక్షిణాదిలో నయనతార గురించి తెలియని వారు ఉండరు. అంచలంచలుగా ఎదిగి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ఫేమ్ దక్కించుకున్న నటి నయనతార. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ నటిస్తున్నారు. షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తున్నారు నయనతార . 2023లో జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నయనతార పవర్ ప్యాక్డ్ రోల్స్ కి కేరాఫ్ గా మారారు. సూపర్ లేడీ గా పేరు తెచ్చుకున్న నయనతార, తాను ఫేస్ చేసిన కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చారు. సినిమాలో మంచి పాత్ర ఇవ్వాలంటే తమకు ఫేవర్ చేయాలని అవతలి వాళ్ళు అడిగిన విషయాన్ని పంచుకున్నారు. నయనతార ఈ మధ్య ఓ మీడియాతో మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పారు.

ఓ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించాలని అవకాశం వచ్చింది నయనతారకు. అయితే ఆ కేర‌క్ట‌ర్ ఆమెకే ఇవ్వాలంటే తప్పకుండా తమకు ఫేవర్స్ చేయాలని మేకర్స్ అప్పట్లో అన్నారుట. వాళ్లు ఎవరు, ఏ సినిమా అనే విషయాలను మాత్రం బయట పెట్టలేదు నయనతార. కానీ నిజమైన టాలెంట్ ఉన్నవాళ్లు అడ్డదారులు తొక్కక్కర్లేదని ఆ ఆఫర్ను తాను తిరస్కరించానని, ఎవరైనా సరే తమ మీద త‌మ‌కు నమ్మకం ఉన్నప్పుడు ఇలాంటి పనులకు వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు నయనతార. ఈమధ్య ఇలాంటి విషయాలు గురించి అసలు ఎప్పుడు ఎక్కడ నోరు విప్పలేదు న‌య‌న్‌.

కానీ ఆమె జీవితంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టం అని అంటున్నారు ఫాన్స్ . ఆమధ్య ఓ వేడుకలో మాట్లాడిన నయనతార మహిళలు ఉన్నత పొజిషన్స్కు చేరుకోవడానికి 50 రెట్లు అధికంగా కష్టపడాల్సి ఉంటుందని అన్నారు. అంత కష్టపడి సాధించుకున్న స్థానాన్ని గౌరవంగా చూసుకోవాలని చెప్పారు. అందుకే కష్టపడి పైకి వచ్చిన మహిళలంటే తనకు అత్యంత గౌరవం అని అన్నారు. నయనతార గత ఏడాది వరుస సినిమాలతో సక్సెస్ లు అందుకున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.