Read more!

English | Telugu

జనవరిలో 'వీరయ్య'ది పైచేయి.. ఫిబ్రవరిలో గెలుపు ఎవరిది!

జనవరి నెల ముగిసింది. సంక్రాంతి కానుకగా విడుదలైన 'వీరసింహారెడ్డి' హిట్ టాక్ తెచ్చుకుంది. 'వాల్తేరు వీరయ్య' సూపర్ హిట్ టాక్ తో నడిచింది. 'వారసుడు' యావరేజ్ టాక్ తో ఓకే అనిపించింది. 'కళ్యాణం కమనీయం' చిత్రం ఫ్లాప్ అయ్యింది. 'హంట్' చిత్రం ది కూడా అదే పరిస్థితి. ఇక హిందీ చిత్రం 'పఠాన్' తెలుగులో కూడా మంచి కలెక్షన్లు వసూలు చేసింది.

ఇక ఫిబ్రవరి సినిమాల సందడి మొదలైంది. నేడు(ఫిబ్రవరి 3న) 'రైటర్ పద్మభూషణ్' సినిమాతో సుహాస్, 'మైఖేల్' మూవీతో సందీప్ కిషన్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో 'రైటర్ పద్మభూషణ్' పాజిటివ్ టాక్ తెచ్చుకోగా, 'మైఖేల్' యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన 'బుట్టబొమ్మ' ఫిబ్రవరి 4న విడుదలవుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ఫిబ్రవరి 10న విడుదల కాబోతోంది. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అందునా 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం కావడం.. ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేయడం మొదలైనవి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కిరణ్ అబ్బవరం గీత ఆర్ట్స్ లో చేసిన 'విన‌రో భాగ్య‌ము విష్ణు కథ' ఫిబ్రవరి 17న విడుదల కాబోతోంది. ధనుష్ తెలుగులో నటిస్తున్న 'సార్' చిత్రం ఫిబ్రవరి 17న విడుదలవుతోంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. సమంత నటించిన శాకుంతలం చిత్రం కూడా ఫిబ్ర‌వ‌రి 17న  విడుదల కానుంది. మైథ‌లాజిక‌ల్ కాన్సెప్ట్ తో భారీ బడ్జెట్ మూవీ గా త్రీడీ వెర్ష‌న్ లో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. గుణశేఖర్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా ఇది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రానికి మంచి అంచనాలు ఉన్నాయి. అందునా ఈ చిత్రానికి దిల్ రాజు భాగస్వామి. 

ఇలా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో విడుదల కానున్న శాకుంతలం, సార్, వినరో భాగ్యము విష్ణు కథ, అమిగోస్ వంటి చిత్రాలపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాలను రాబడతాయో వేచి చూడాలి. ఈ సినిమాలన్నీ మంచి కాన్సెప్ట్ లతో  రూపొందుతున్న చిత్రాలే కావడం.. కంటెంట్ పరంగా స్ట్రాంగ్ గా ఉన్నాయని తెలుస్తుండడంతో ఈ ఫిబ్రవరి కూడా జనవరి లాగానే సినిమా వారికి సంతోషాన్ని మిగిల్చే నెలగా మారుతుందని చెప్పుకోవచ్చు.