Read more!

English | Telugu

సందీప్ కిషన్ కి మళ్ళీ కలిసి రాలేదు!

టాలీవుడ్ లో ప్రతిభ గల యువ నటుల్లో సందీప్ కిషన్ ఒకడు. కెరీర్ ప్రారంభంలోనే ఆయన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ హీరోగా మాత్రం విజయాలను అందుకోలేకపోతున్నాడు. తెలుగులో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', తమిళ్ లో 'మానగరం' మినహా సందీప్ కి పెద్దగా విజయాలు దక్కలేదు. ఈ క్రమంలో తన తాజా చిత్రం 'మైఖేల్'పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. పాన్ ఇండియా ఫిల్మ్ గా ప్రచారం పొందిన మైఖేల్ మంచి అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మొదటి షో నుంచే సినిమా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

సందీప్ కి ప్రతిభ ఉంది.. కష్టపడే తత్వం ఉంది.. కానీ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు.. 'మైఖేల్' నుంచి అతనికి అదృష్టం తోడవుతుందని భావిస్తున్నాను అంటూ ఇటీవల ఆ సినిమా వేడుకలో నేచురల్ స్టార్ నాని కామెంట్స్ చేశాడు. సందీప్ సైతం ఈ సినిమాపై పట్ల ఎప్పుడూ లేనంత కాన్ఫిడెంట్ గా కనిపించాడు. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సందీప్ ఖాతాలో హిట్ పడినట్లేనని భావించారంతా. కానీ తీరా విడుదలయ్యాక సినిమా ఏమాత్రం అంచనాలకు తగ్గట్లుగా లేదంటూ రివ్యూలు వస్తున్నాయి. సందీప్ కి ఈ సినిమా కూడా హిట్ ఇవ్వలేకపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి టాలెంటెడ్ యాక్టర్ ని విజయం ఎప్పుడు వరిస్తుందో చూడాలి.