English | Telugu

ఇండియన్‌2 తర్వాత కమల్‌ సినిమా ఇదే!


యంగ్‌స్టర్స్‌ స్పీడు మీదుంటే గొప్పేముంటుంది? సీనియర్లు స్పీడు చూపిస్తుంటే ముచ్చటేస్తుంది. ఒకటీ, రెండూ, మూడూ అంటూ పరీక్షల రిజల్టులు వచ్చినప్పుడు వినిపించే ప్రకటనల్లాగా నాన్‌స్టాప్‌ సినిమాలతో రెడీ అవుతున్నారు సీనియర్‌ హీరోలు. వారిలో కమల్‌హాసన్‌ మరీ స్పీడు మీదున్నారు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు నిర్మాతగానూ హెక్టిక్‌గా ఉన్నారు. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ చేస్తున్నారు కమల్‌. ఈ సినిమా మొదలుపెట్టినప్పటినుంచి ఏవో అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. అన్నీ మంచికే, పెద్ద పనులు సులువుగా కావు. ఇలాంటి వాటిని దాటితేనే సిసలైన కిక్కు అంటూ మూవీ యూనిట్‌కి స్ఫూర్తి పంచుతున్నారు లోకనాయకుడు. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే సౌత్‌ ఆఫ్రికాలో జరగనుంది. అక్కడ జరిగే షెడ్యూల్‌లో ఓ భారీ ట్రైన్‌ యాక్షన్‌ సీక్వెన్స్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అది పూర్తయితే, ఇండియన్‌2 సినిమా దాదాపుగా కంప్లీట్‌ అయినట్టే.

ఆ వెంటనే ఆలస్యం చేయకుండా నెక్స్ట్ సినిమాను సెట్‌ చేసేశారు కమల్‌హాసన్‌. అజిత్‌తో బ్యాక్‌ టు బ్యాక్‌ మూడు సినిమాలు చేసిన హెచ్‌.వినోద్‌ చెప్పిన కథ నచ్చిందట కమల్‌హాసన్‌కి. కొద్దిపాటి మార్పులు చేర్పులు సూచించి, గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారట. ప్రస్తుతం డ్రాఫ్ట్ ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారు హెచ్‌.వినోద్‌. ఒక్కసారి కమల్‌ సౌత్‌ ఆఫ్రికా నుంచి రాగానే ఫుల్‌ నెరేషన్‌ ఇచ్చేస్తారు. వెంటనే ప్రీ ప్రొడక్షన్‌ పనులు, షూటింగ్‌ మొదలుపెట్టేస్తారని టాక్‌.

ఇదే స్పీడు మీద వెళ్తే కమల్‌హాసన్‌ ఏడాదికి మూడు సినిమాలు విడుదల చేయడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం విజయ్‌తో లియో తెరకెక్కిస్తున్న లోకేష్‌ కనగరాజ్‌ ఈ దీపావళికి ఫ్రీ అయిపోతారు. డిసెంబర్‌లో విక్రమ్‌2 పనులు మొదలుపెడతారనే టాక్‌ కూడా ఉంది. సో ఆ టైమ్‌కి మిగిలిన సినిమాల పనులు కంప్లీట్‌ చేసేసుకోవాలన్నది కమల్‌ టార్గెట్‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.