English | Telugu

హన్సికకి సర్ ప్రైజ్ కాంబోని ఇచ్చిన సోహెల్!

'హన్సిక లవ్ షాదీ డ్రామా' సీజన్ లోని ఒక్కో ఎపిసోడ్‌ ప్రతీవారం రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రతీ ఎపిసోడ్ లో ఏదో ఒక సస్పెన్స్ తో ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తున్నారు మేకర్స్ . కాగా 'ది ఫేరి టేల్ వెడ్డింగ్' అనే టైటిల్ తో హన్సిక లవ్ షాదీ డ్రామా ఆరవ ఎపిసోడ్‌ తాజాగా విడుదల అయింది.‌ దీనిలో అందరూ పెళ్ళికి వచ్చిన గిఫ్ట్ ల గురించి మాట్లాడుకుంటూ బిజీగా ఉన్నారు. అదే సమయంలో పెళ్ళిలో ప్రభుదేవా సాంగ్ ప్లే చేసారు. దానికి సోహెల్ వెళ్ళి డ్యాన్స్ వేయగా హన్సిక వావ్ అంటూ ఆశ్చర్యపోయింది. ‌"నా కోసం చాలా కష్టపడ్డాడు సోహెల్. అసలు ఊహించలేదు డ్యాన్స్ అంత బాగా చేస్తాడని, నాకు సర్ ప్రైజ్ కాంబో ఇచ్చాడు" అని హన్సిక చెప్పింది.

ఆ తర్వాత సంగీత్ లో‌ డ్యాన్స్ ‌మొదలైంది.‌ మొదట తన ఫ్రెండ్స్ డ్యాన్స్ చేయగా, మెల్లిగా ఆ డ్యాన్స్ లోకి ఆంటి‌, అంకుల్ చేరారని హన్సిక‌ చెప్పగా.. "మా‌ డాడ్ ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు. ఫస్ట్ టైం చూసా అతని డ్యాన్స్" అని సోహెల్ చెప్పాడు. ఆ తర్వాత హన్సిక వాళ్ళ‌ బ్రదర్ ప్రశాంత్ డ్యాన్స్ చేసి అదరగొట్టాడు. అయితే మధ్యలో తను కొన్ని‌ స్టెప్స్ మర్చిపోయాడు. వెంటనే నా వైపు చూసి అయిపోయాను అన్నట్టు ఫేస్ పెట్టాడు వెంటనే నేను, అమ్మ‌ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళాం. వాడు మా ఇద్దరిని చూసి ఎమోషనల్ అయ్యి ఏడ్చేసాడని‌ హన్సిక చెప్పింది. వీళ్ళు ముగ్గురు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని సోహెల్ చెప్పగా.. "ఇప్పుడు నలుగురం అయ్యాం" అని హన్సిక చెప్పింది. ఆ తర్వాత బాంబే రాకర్స్ ఆ డ్యాన్స్ స్టేజ్ మీదకి వచ్చేసి పాప్ సాంగ్ తో అదరగొట్టారు. తర్వాత రోజు హల్దీ జరిగింది. అందులో అందరూ కూడా పసుపు పూసుకుంటూ ఎంజాయ్ చేసారు. పసుపు కలర్ డిజైన్ బట్టలని ధరించి సోహెల్, హన్సిక వచ్చారు. బంధువులు కూడా పసుపు బట్టలతో రావడంతో పండగ వాతావరణం నెలకొంది.

ఆ తర్వాత రోజు పెళ్ళి కోసం ఏర్పాట్లు జరిగాయి. అందులో పెళ్ళి కూతురు డ్రెస్ లో తనని చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయని, తను నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని ఒక అద్భుతమైన ఫీలింగ్ అని సోహెల్ చెప్పాడు. సోహెల్ ని చూసిన తర్వాత నాకు నచ్చినవాడినే చేసుకుంటున్నాను.. చాలా ఎమోషనల్ అయ్యానని హన్సిక చెప్పింది. ఆ తర్వాత హన్సిక పెళ్ళి అంగరంగవైభవంగా జరుగుతుంది. హన్సిక- సోహెల్ ల పెళ్ళి జరిగాకా హన్సిక వాళ్ళ అమ్మ మోనా, తమ్ముడు ప్రశాంత్ ని పట్టుకొని ఏడుస్తుంది హన్సిక. "నా బంగారుతల్లి నా ఇల్లు వదిలి వెళ్ళిపోతే, ఇల్లంతా శూన్యంలా అనిపించింది.. ఆ ఫీలింగ్ వివరించడం చాలా కష్టం.. తను బై చెప్పేసి వెళ్తుంటే నాకు కన్నీళ్ళు ఆగలేదు" అని హన్సిక వాళ్ళ అమ్మ చెప్పుకొచ్చింది. అలా ఆరవ ఎపిసోడ్‌ ముగిసింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.