English | Telugu

విజ‌య్‌ని ఫాలో అవుతున్న సూర్య‌!

సూర్య హీరోగా న‌టిస్తున్న సినిమాను యూవీ క్రియేష‌న్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సిరుత్తై శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ని ఆ మ‌ధ్య గోవాలో చిత్రీక‌రించారు. ఆ త‌ర్వాత చెన్నైలో కీ సీన్స్ చేశారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. సూర్య‌కి జోడీగా దిశా పటాని న‌టిస్తున్నారు. కీల‌క పాత్ర‌లో న‌టిస్తారంటూ మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ సినిమాకు వీర్ అనే టైటిల్‌ని ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం.

దాదాపు 10 భాష‌ల్లో తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్. అన్నీ భాష‌ల వాళ్ల‌కీ క‌నెక్ట్ అయ్యేలా వీర్ అనే టైటిల్ పెట్టారు. ఇప్ప‌టిదాకా సూర్య న‌టించిన సినిమాల్లో అత్య‌ధిక బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న సినిమా ఇదే. త్వ‌ర‌లోనే శ్రీలంక‌లోని డీప్ ఫారెస్ట్ లోనూ షూటింగ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఏప్రిల్ 14న త‌మిళ ఉగాదిని పుర‌స్క‌రించుకుని సినిమాలోని కేర‌క్ట‌ర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట డైర‌క్ట‌ర్ సిరుత్తై శివ‌.

సిరుత్తై శివ అన‌గానే ప‌క్కా ఊర‌మాస్ స‌బ్జెక్ట్ ని తెర‌కెక్కిస్తార‌నే పేరుంది. అందులోనే సెంటిమెంట్‌ని ట‌చ్ చేస్తార‌నే పేరుంది. ఈ సినిమాలో సూర్య గ‌త చిత్రాల్లో ఎప్పుడూ క‌నిపించ‌న‌న్ని గెట‌ప్పుల్లో క‌నిపిస్తార‌ని టాక్‌. అందుకోసం మేక‌ప్‌కే ప్ర‌తిరోజూ ఆరు గంట‌ల సమ‌యం తీసుకుంటార‌నే మాట‌లూ ఉన్నాయి. అయితే సినిమా నిర్మాణ సంస్థ‌లు మాత్రం దీని గురించి ఇప్ప‌టిదాకా ఏ ప్ర‌క‌ట‌నా ఇవ్వ‌లేదు.

రీసెంట్ టైమ్స్ లో సినిమాను ప్రారంభించ‌డానికి ముందే విక్ర‌మ్‌, లియో చిత్రాల ద్వారా ఆడియ‌న్స్ కి బెస్ట్ ట్రీట్ ఇచ్చారు లోకేష్ క‌న‌గ‌రాజ్‌. అత‌ని స్టైల్‌ని ఫాలో కావాల‌ని అనుకుంటున్నార‌ట సిరుత్తై శివ‌. కేర‌క్ట‌ర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ టీజ‌ర్‌తోనే సినిమా మీద హైప్ క్రియేట్ చేయాల‌న్న‌ది శివ ప్లాన్ అట‌. ఇందులోనే సూర్య గెట‌ప్స్ ని రివీల్ చేస్తారా? లేకుంటే, వాటికి సంబంధించి జ‌స్ట్ హింట్ ఇచ్చి వ‌దిలేస్తారా? అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్న సూర్య‌, ప్ర‌స్తుతం ఈ సినిమాను కంప్లీట్ చేసే ప‌నిలో ఉన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .