English | Telugu

పర్ఫెక్ట్ హస్బెండ్ కి భార్యనైనందుకు గర్వపడుతున్నా

యాంకర్ లాస్య ఒకప్పుడు "సంథింగ్ స్పెషల్" ప్రోగ్రాం ద్వారా ఒక వెలుగు వెలిగిన యాంకర్. అలాంటి లాస్య కెరీర్ స్టార్టింగ్ లోనే మంజునాథ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చాక ఈమె బుల్లితెర మీద భర్తతో సహా ఎన్నో షోస్ లో కనిపించి అలరించింది.

ఇక లాస్య ముందు జున్ను అనే ఒక బాబు ఉన్నాడు. రీసెంట్ గా వీళ్లకు మరో బాబు పుట్టాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెరైటీ గా చెప్పింది లాస్య. ఐతే లాస్య భర్త మంజునాథ్ పుట్టినరోజు సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. 'పర్ఫెక్ట్ హస్బెండ్ కి భార్యనైనందుకు గర్వపడుతున్నా. ఈ ప్రపంచంలో నా పిచ్చితనాన్ని భరించే వ్యక్తివి నువ్వే. హ్యాపీ బర్త్ డే మంజునాథ్. నువ్వు నన్ను నవ్వించావు, కన్నీళ్లు తుడిచావు. నా సక్సెస్ చూశావు. కష్టాల్లో ఉన్నప్పుడు నా పక్కనే నిలబడ్డావు.

నా సంతోషానికి కారణం నువ్వే" అంటూ ఒక టాగ్ లైన్ పెట్టింది. తన భర్తతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ లో దిగిన ఫొటోస్ ని ఈ సందర్భంగా షేర్ చేసుకుంది. మంజునాథ్ కి హ్యాపీ బర్త్ డే అంటూ నెటిజన్స్, ఫాన్స్ విషెస్ చెప్పారు. లాస్య ప్రస్తుతం సంతోషంగా ఫ్యామిలీ జీవితాన్ని గడుపుతోంది. అప్పట్లోనే యాంకర్ లాస్య చీమ, ఏనుగు జోకులతో ఫుల్ ఫేమస్ అయ్యింది. రవి, లాస్య చేసిన షో అప్పట్లో టాప్ రేటింగ్స్ ని సొంతం చేసింది.