English | Telugu

‘ఇరాట్ట’ మూవీ రివ్యూ


మూవీ: ఇరాట్ట
తారాగణం: జోజూ జార్జ్, అంజలి, మనోజ్ కె. యు, ఆర్యన్ సలీం, శ్రీకాంత్ మురళి తదితరులు.
ఎడిటింగ్: మను ఆంటోని
సినిమాటోగ్రఫీ: విజయ్
సంగీతం: జేక్స్ బిజోయ్
నిర్మాతలు: జోజూ జార్జ్, మార్టిన్ ప్రక్కట్, సిజో వడక్కన్, ప్రశాంత్ కుమార్
బ్యానర్: అప్పు పాతు పప్పు ప్రొడక్షన్ హౌస్, మార్టిన్ ప్రకృత్ ఫిల్మ్స్
కథ & డైరెక్టర్: రోహిత్ ఎమ్.జి కృష్ణన్
ఓటిటి: నెట్ ఫ్లిక్స్

జోజూ జార్జ్ డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమాని రోహిత్ ఎమ్.జి కృష్ణన్ డైరెక్ట్ చేశాడు. నెట్ ఫ్లిక్స్ లో మార్చి 3 న మలయాళంలో విడుదల చేసిన ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసారు. ఈ కథేంటో ఒకసారి చూసేద్దాం.

కథ:

కేరళలోని ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఫంక్షన్ కోసం ఏర్పాట్లు జరుగుతుంటాయి. అక్కడికి మీడియా వాళ్ళు, అధికారులు, సామాన్య ప్రజలు వచ్చి ఎదురుచూస్తుంటారు. ఆ ప్రోగ్రామ్ కి అక్కడి అటవీ శాఖా మంత్రి రాబోతున్నట్టుగా మీడియా ద్వారా తెలుస్తుంది. దాంతో అక్కడ పోలీస్ అధికారులంతా ఫంక్షన్ దగ్గరికి వచ్చి ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తుంటారు. అయితే కాసేపటికి సడన్ గా స్టేషన్ లోపలి నుండి మూడు సార్లు తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తుంది. దీంతో అక్కడ ఉన్నవాళ్ళంతా భయానికి లోనవుతారు. పోలీసులంతా లోపల ఏం జరిగిందని పరుగెత్తుకుంటూ వెళ్తారు. మరోవైపు హాస్పిటల్ బెడ్ మీద ఉన్న మరో పోలీస్ అధికారి డీఎస్పీ ప్రమోద్(జోజూ జార్జ్) కి ఆ ఘటన జరిగిన స్టేషన్ నుండి కాల్ రావడంతో హాస్పిటల్ నుండి స్టేషన్ కి వెళ్తాడు. స్టేషన్ లోపలికి వెళ్ళి చూస్తే ఏఎస్ఐ వినోద్(జోజూ జార్జ్)
చనిపోయి ఉంటాడు. ఇంతకీ ఏఎస్ఐ వినోద్ ని చంపిందెవరు? డీఎస్పీ ప్రమోద్ కి వినోద్ కి గల సంబంధం ఏంటి? తెలియాలంటే 'నెట్ ఫ్లిక్స్' లోని ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

పోలీస్ స్టేషన్లో మూడు సార్లు తుపాకీ పేలిన శబ్దంతో ఆసక్తిగా మొదలైన కథ అలా చివరి వరకు ఎంగేంజింగ్ గా సాగుతుంది. ఏఎస్ఐ వినోద్(జోజూ జార్జ్) పాత్రని అద్భుతంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్. హత్య జరిగిన నుండి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం ఒక ఫ్లోలో వెళ్తుంటుంది. ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే తో ముందుకు సాగుతుంది.

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ని ఎంచుకున్న డైరెక్టర్ ఈ సినిమా స్క్రీన్‌ప్లే ని చివరి వరకు ఎక్కడా కూడా బోర్ రాకుండా, తర్వాత ఏం జరుగుతుందనే ఫీల్ ని కలుగజేస్తూ కథని ముందుకు తీసుకెళ్ళాడు. ఒక్కో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కే కాస్త నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్స్ సీన్స్ చూపించేవి కాస్త స్లోగా సాగుతాయి. ఈ సినిమా మొదటి నలభై నిమిషాలు ఒక ఎత్తైతే , చివరి నలభై నిమిషాలు ఒక ఎత్తు.. రెగ్యులర్ గా సస్పెన్స్ సినిమాలని చూసే ప్రేక్షకులు‌ సైతం క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ని కనిపెట్టలేకపోతారు. ఒకటి రెండు ట్విస్ట్ లు కాదు.. చాలా ట్విస్ట్ లు ఉంటాయి. సినిమాని మధ్యలో ఎక్కడ స్కిప్ చేసినా స్టోరీ మిస్ అవుతుంది. ప్రతీ పాత్రకి అలాంటి ఇంపార్టెన్స్ ఇస్తూ కథనంలో ప్రేక్షకులను లీనం అయ్యేలా చేసాడు డైరెక్టర్.

జేక్స్ బిజోయ్ సంగీతం బాగుంది. క్లైమాక్స్ లో వచ్చే బిజిఎమ్ అదిరిపోయింది. విజయ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. విజయ్ ఎడిటింగ్ బాగుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కాస్త ట్రిమ్ చేస్తే ఇంకా బాగుండేది. కథలో ప్రేక్షకుడిని లీనం చేయడంలో డైరెక్టర్ రోహిత్ కృష్ణన్ సక్సెస్ అయ్యాడు. రెగ్యులర్ గా ఉండే ట్విస్ట్ లు కాకుండా ప్రేక్షకుడు అసలు ఊహించని ట్విస్ట్ లు బాగుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

డీఎస్పీ ప్రమోద్ గా, ఏఎస్ఐ వినోద్ గా జోజూ జార్జ్ ఒదిగిపోయాడు. ఏఎస్ఐ వినోద్ పాత్రని జోజూ జార్జ్ అందరికీ గుర్తుండిపోయేంతలా చేసాడు. అంజలి ఉన్నంతలో ఆకట్టుకుంది. మిగిలిన వాళ్ళు వారి వారి పాత్రలలో బాగా నటించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ సినిమాలని ఇష్టపడే వారికి ఒక మంచి సినిమా చూసామనే తృప్తినిస్తుంది.

రేటింగ్: 3.5 / 5

✍🏻. దాసరి మల్లేశ్

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .