English | Telugu

'వరుడు' హీరోయిన్‌ను ట్విట్టర్‌లో బ్లాక్ చేసిన అల్లు అర్జున్.. బాధపడ్డ భానుశ్రీ!

భానుశ్రీ మెహ్రా.. ఈ పేరెక్కడో విన్నట్లుంది కదూ.. యస్.. అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ రూపొందించిన 'వరుడు' సినిమా హీరోయిన్. అది హీరోయిన్‌గా ఆమె తొలి చిత్రం. అంటే ఆమె తొలి హీరో బన్నీ! అలాంటిది ఈరోజు బన్నీ కారణంగా ఆమె బాధపడింది. ట్విట్టర్లో తనను ఫాలో అవుతున్న భానుశ్రీని బన్నీ బ్లాక్ చేశాడు. దీనితో షాక్‌కు గురైన భానుశ్రీ.. బన్నీ తనను బ్లాక్ చేసిన పిక్చర్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది.

"మీకు ఎప్పుడైనా ఒక గాడిలో కూరుకుపోయారని అనిపించిందా? నేను అల్లు అర్జున్‌తో 'వరుడు'లో నటించాననీ, ఇప్పటికీ అవకాశాలు అందుకోలేకపోతున్నాననీ గుర్తుంచుకోండి. కానీ నేను నా స్ట్రగుల్స్‌లో సరదాగా ఉండటం నేర్చుకున్నాను- ప్రత్యేకించి ఇప్పుడు అల్లు అర్జున్ నన్ను ట్విట్టర్‌లో బ్లాక్ చేశాక." అని రాసుకొచ్చింది.

'వరుడు' సినిమా డిజాస్టర్ కావడంతో భానుశ్రీకి అవకాశాలు లేకుండా పోయాయి. నిజానికి ఆ మూవీలో ఆమెను చాలా అందంగా చూపించాడు దర్శకుడు గుణశేఖర్. అయితే ఆ సినిమా చేసే కాలంలోనే ఆమెకు వేరే చిత్రాల్లో అవకాశాలు వచ్చినా, గుణశేఖర్ సూచనతో ఆమె వాటిని ఒప్పుకోకుండా ఉండిపోయింది. వరుడు పెద్ద విజయం సాధించి, తనకు క్రేజ్ తీసుకు వస్తుందని ఆమె ఆశిస్తే, ఆ సినిమా విడుదలయ్యాక అందుకు పూర్తి విరుద్ధమైన ఫలితం వచ్చింది. ఆ తర్వాత కొన్ని చిన్న సినిమాల్లో నటించింది కానీ, అవేవీ ఆమె కెరీర్‌కు ఏమాత్రం బూస్ట్ ఇవ్వలేకపోయాయి. కొన్ని సినిమాలైతే విడుదలకే నోచుకోలేదు.

అలాంటి కెరీర్ పరంగా సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటూ కాలం నెట్టుకొస్తోన్న ఆమె, ఇప్పుడు తన తొలి హీరో ట్విట్టర్‌లో తన బ్లాక్ చేయడంతో ఖిన్నురాలైంది. ఆ బాధను బయటి ప్రపంచానికి చెప్పుకోలేకుండా ఉండలేకపోయింది. అయితే భానుశ్రీని బన్నీ ఎందుకు బ్లాక్ చేశాడనేది ప్రశ్నగా మిగిలింది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.