English | Telugu
కూల్ మంకీ... సెల్ఫీ కింగ్
Updated : Mar 17, 2023
అభిజిత్ మీకు గుర్తున్నాడు కదా...శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' మూవీలో హీరో. అభిజిత్ కి సరైన బ్రేక్ ఐతే ఇప్పటి వరకు రాలేదు. మూవీస్ వర్కౌట్ కాకపోయేసరికి "పెళ్లి గోల" అనే వెబ్ సిరీస్ చేసాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఆఫర్ వచ్చేసరికి వెళ్ళాడు. అలా సీజన్ 4 విన్నర్ గా నిలిచాడు. ప్రస్తుతం మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ బుల్లితెర ఈవెంట్స్ లో కానీ ఎక్కడా కనిపించని అభిజిత్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. అలాంటి అభిజిత్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో కోతితో కలిసి దిగిన ఒక సెల్ఫీని పోస్ట్ చేసాడు.
కానీ ఈ పిక్ చూస్తుంటే మాత్రం కోతి సెల్ఫీ తీస్తునట్లుగా కనిపిస్తుంది. అసలు కోతి సెల్ఫీ ఎలా తీయగలిగిందని అంటూ నెటిజన్స్ ఆశ్చర్యపోయారు. ఈ ఫొటో ఎవరు తీశారంటూ ఒక వ్యక్తి అడిగేసరికి " కోతి..దాని పేరు రెడ్ థార్ నీడ్స్ టు గెట్ డర్టీ" అని చెప్పాడు. ఈ పిక్చర్ కి బెస్ట్ సెల్ఫీ ఆఫ్ ది ఇయర్ ఇవ్వొచ్చు...కూల్ మంకీ..సెల్ఫీ కింగ్" అంటూ కామెంట్స్ చేశారు నెటిజన్స్. బిగ్ బాస్ లో పాపులారిటీ వచ్చినా కానీ దాన్ని సరిగా వినియోగించుకోలేకపోయాడంటారు చాలామంది. అభిజిత్ కి అక్కినేని ఫ్యామిలీకి మంచి అనుబంధమే ఉంది. నాగార్జున సుపుత్రుడు అఖిల్ చదివిన కిండర్ గార్టెన్ చైతన్య విద్యాలయ స్కూల్‌లోనే అభిజిత్ కూడా చదువుకున్నాడు. అఖిల్ స్కూల్ మేట్‌తో పాటు క్లాస్ మేట్ కూడా.