English | Telugu
తాప్సీ డైట్‌కి నెలనెలా ఎంతవుతుందో తెలుసా?
Updated : Mar 17, 2023
తాప్సీ ఇప్పుడు సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ కాదు. అంతకు మించి. నేషనల్ యాక్ట్రెస్. వైవిధ్యమైన స్క్రిప్ట్ సెలక్షన్‌తో ఆమె ప్యాన్ ఇండియన్ ఆర్టిస్టుగా మారిపోయారు. ముఖ్యంగా పింక్ సినిమా తర్వాత నార్త్ ఇండియా తాప్సీ సినిమాల మీద స్పెషల్‌గా కాన్‌సెన్‌ట్రేషన్ చేస్తోంది. కెరీర్ స్టార్టింగ్‌లో ఉత్తరాదిన స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు రాలేదు తాప్సీకి. అయినా ఫీమేల్ ఓరియంటెడ్ కంటెంట్‌తో దూసుకుపోయారు. అప్పటిదాకా ఆ పని చేసింది నార్త్ లో కంగన మాత్రమే. తాప్సీ తనను చూసి కాపీ కొడుతోందని కూడా కంగన మండిపడ్డ సందర్భాలు లేకపోలేదు. వాటన్నిటినీ ఏమాత్రం పట్టించుకోలేదు తాప్సీ. తనవైన కథలతో దూసుకుపోయారు. రీసెంట్‌గా తన మెయింటెనెన్స్ కి సంబంధించి తాప్సీ ఓ ఇంటర్వ్యూలో చాలా విషయాలను పంచుకున్నారు.
ఆమె మాట్లాడుతూ ``నేను నా కెరీర్ స్టార్టింగ్‌లో బొద్దుగా ఉండేదాన్ని. సౌత్‌లో కమర్షియల్ సినిమాల్లో నటించేటప్పుడు అలా బొద్దుగా ఉండటం ప్లస్ అయింది. కానీ యాక్షన్ ఓరియంటెడ్ స్టఫ్‌ని ఎంపిక చేసుకుంటున్నప్పుడు నాజూగ్గా మారాల్సి వచ్చింది. అందుకే కాన్‌సెన్‌ట్రేట్ చేసి మరీ తగ్గాను. అలా తగ్గడానికి నాకు చాలా సమయం పట్టింది. అయినా డైటీషియన్ హెల్ప్ తీసుకున్నాను. ఇప్పటికీ నా డైట్‌కీ, డైటీషియన్‌కి నేను లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాను. నేనున్న రంగంలో ఆరోగ్యం మీద శ్రద్ధ చాలా అవసరం. ఫిజికల్ అప్పియరెన్స్ కూడా కీలకం.వాటిని బ్యాలన్స్ చేయాలంటే డైటీషియన్‌కి ఖర్చు పెట్టాల్సిందే. కానీ ఈ విషయం తెలిస్తే మా నాన్న అస్సలు ఒప్పుకోరు. మూడు పూటలా తినడానికి లక్ష ఎందుకు అని ప్రశ్నిస్తారు? మాకు డబ్బులు లేవని కాదు. వృథాగా ఖర్చుపెడతానన్నది నాన్నగారి ఉద్దేశం. నా రంగంలో డైట్‌కి ఉన్న ఇంపార్టెన్స్ ఆయనకు చెప్పినా అర్థం కాదు. అందుకే నేను నాన్నతో డైట్‌కి అయ్యే ఖర్చుల గురించి డిస్కస్ చేయను`` అని అన్నారు. ఆమె నటించిన హసీనా దిల్‌రుబాకి సీక్వెల్ సిద్ధమవుతోంది. చీరకట్టులో తాప్సీ వయ్యారంగా కనిపిస్తున్న ఫొటో ఇన్‌స్టంట్‌గా వైరల్ అయింది.