English | Telugu

రామ్ సినిమాలో విలన్ గా కోలీవుడ్ హీరో!!

ఎనర్జిటిక్ హీరో రామ్, కోలీవుడ్ డైరెక్టర్ లింగు స్వామి కాంబినేషన్‌ లో ఓ బైలింగ్యువల్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ లో విలన్ గా తమిళ హీరోని తీసుకోవాలని ముందుగానే భావించారట. ఇప్పటికే పలువురు పేర్లను పరిశీలించిన మేకర్స్.. ఫైనల్ గా ఆర్యను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.

ఆర్యకు తమిళ నాట మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే తెలుగులోనూ మంచి పేరే ఉంది. తెలుగులో 'వరుడు', 'సైజ్ జీరో' లాంటి సినిమాలలో నటించిన ఆయన.. 'రాజారాణి', 'నేనే అంబానీ' వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న రామ్ 19లో విలన్ పాత్రకోసం ఆర్యను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ పాత్రకు ధీటుగా ఆర్య పాత్ర ఉంటుందట. ఆర్య దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.

రామ్ 19లో 'ఉప్పెన' ఫేం కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీనివాసా చిట్టూరి సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.