English | Telugu
ధనుష్ దర్శకత్వంలో రజినీకాంత్!!
Updated : Jul 10, 2021
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం 'అన్నాత్తే' చిత్రంలో నటిస్తున్నారు. రజినీ 168వ చిత్రంగా తెరకెక్కుతోన్న దీనికి శివ దర్శకత్వం వహిస్తుండగా.. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ తర్వాత రజినీ నటనకు స్వస్తి పలకబోతున్నారని ఇటీవల వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం రజనీ ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్ట్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. వాటిలో ఒక చిత్రానికి కోలీవుడ్ స్టార్ హీరో దర్శకత్వం వహించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
రజినీ 169వ చిత్రానికి పెరియసామి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక రజినీ 170వ చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రజినీ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య దీనిని నిర్మిస్తున్నట్టు సమాచారం.
కాగా, ధనుష్ 'పవర్ పాడి' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇటీవలే ఆయన దర్శకత్వంలో రెండవ సినిమా మొదలవబోతున్నట్టు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం దర్శకుడిగా ధనుష్ రెండో మూవీ రజినీతో అని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.