English | Telugu

ఆగస్టు 7న 'లవ్ స్టోరి' విడుదల!!

'ఫిదా' వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న మూవీ 'లవ్ స్టొరీ'. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'సారంగ ధరియా' పాట యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ తెచ్చుకుంది.

వాస్తవానికి 'లవ్ స్టొరీ' మూవీ ఏప్రిల్ 16నే థియేటర్స్ లో విడుదల కావాల్సి ఉంది. అయితే, కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదాపడింది. మరో థియేటర్స్ మూతపడటం, రీఓపెన్ అవ్వడానికి టైం పడుతుండటంతో.. 'లవ్ స్టొరీ' నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుందంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను నిర్మాతలు ఖండించారు. ఆలస్యమైనా తమ సినిమాను ఖచ్చితంగా థియేటర్స్ లోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

కాగా 'లవ్ స్టొరీ' విడుదల తేదీపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. థియేటర్స్ రీఓపెన్ చేయడానికి ఇప్పటికే ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో మేకర్స్ తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే 'లవ్ స్టొరీ' చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేయడానికి నిర్మాతలు ముహూర్తం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని అంటున్నారు.