ఆ హీరో నన్ను అసభ్యంగా తాకాడు!
ఒక తమిళ్ హీరో తనను వేధించాడని, షూటింగ్ సమయంలో అసభ్యంగా తాకుతూ ఇబ్బంది పెట్టాడని ప్రముఖ హీరోయిన్ నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సౌత్ లో నిత్యామీనన్ కి మంచి ఇమేజ్ ఉంది. అందాల ప్రదర్శన చేయకుండా, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ ఇలా అన్ని సౌత్ భాషల్లోనూ ఆమె సినిమాలు చేశారు.