English | Telugu
విశ్వక్ సేన్ కోసం అంజలి నయా అవతార్!
Updated : Jun 16, 2023
కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ తన 11వ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన విశ్వక్ సేన్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా మూవీ టీమ్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రముఖ నటి అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
అంజలి పుట్టినరోజు(జూన్ 16) సందర్భంగా 'VS 11' నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె రత్నమాలగా కనిపించనుంది. తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ లో చీరకట్టుతో మాస్ లుక్ తో ఆకట్టుకుంటోంది అంజలి. పోస్టర్ ని బట్టి చూస్తే, ఈ సినిమాలో ఆమె పవర్ ఫుల్ పాత్ర పోషిస్తోందని అర్థమవుతోంది.
యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా అనిత్ మధాది, ఆర్ట్ డైరెక్టర్ గా గాంధీ నడికుడికర్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.