‘అయల్వాశి’ మూవీ రివ్యూ
థాజు, బెన్నీ, అజిప్పన్ అనే ముగ్గురు స్నేహితులు ఉంటారు. ఒకరోజు థాజు ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఏదో అవసరం వచ్చి బెన్నీ స్కూటీని థాజు తీసుకెళ్తాడు. మరుసటి రోజు తన స్కూటీ మీద స్క్రాచ్ పడిందని, అది థాజు చేసాడని థాజుతో బెన్నీ గొడవపడతాడు. అలా ఆ స్కూటీ వల్ల స్నేహితులిద్దరు విడిపోతారు. థాజు తను తప్పు చేయలేదని నిరూపించడానికి, స్కూటీ మీద స్క్రాచ్ ఎవరు చేశారో కనిపెట్టాలనుకుంటాడు. మరి థాజు ఆ వ్యక్తిని కనిపెట్టగలిగాడా? స్నేహితులిద్దరు మళ్ళీ కలిసారా? లేదా అనేది మిగతా కథ....