English | Telugu
ఆ హీరో నన్ను అసభ్యంగా తాకాడు!
Updated : Jun 16, 2023
ఒక తమిళ్ హీరో తనను వేధించాడని, షూటింగ్ సమయంలో అసభ్యంగా తాకుతూ ఇబ్బంది పెట్టాడని ప్రముఖ హీరోయిన్ నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సౌత్ లో నిత్యామీనన్ కి మంచి ఇమేజ్ ఉంది. అందాల ప్రదర్శన చేయకుండా, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ ఇలా అన్ని సౌత్ భాషల్లోనూ ఆమె సినిమాలు చేశారు. తమిళ్ లో పలువురు స్టార్ హీరోలతోనూ స్క్రీన్ పంచుకున్నారు. అలాంటిది ఓ తమిళ్ హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నిత్యామీనన్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన నిత్యామీనన్.. కేవలం సినీ పరిశ్రమలోనే కాదు, కామాంధులు అన్ని రంగాల్లోనూ ఉంటారని అన్నారు. అయితే తాను తెలుగు పరిశ్రమలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదని చెప్పారు. కానీ తమిళ్ లో మాత్రం ఒక సినిమా షూటింగ్ సమయంలో బాగా ఇబ్బంది పడ్డానని తెలిపారు. ఒక హీరో తనని వేధించాడని, అసభ్యంగా తాకుతూ ఇబ్బంది పెట్టాడని అన్నారు. ఇప్పుడు నిత్యామీనన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. అలాగే ఆ హీరో ఎవరనే చర్చలు జరుగుతున్నాయి.