English | Telugu
ఆ హీరోతో ఫాహద్‌కి గొడవేంటి?
Updated : Jun 17, 2023
పార్టీ లేదా పుష్ప అంటూ ఒకే ఒక్క డైలాగ్‌తో తెలుగులో సూపర్ పాపులర్ అయిపోయారు భన్వర్ సింగ్ షెకావత్ అలియాస్ ఫాహద్ ఫాజిల్. ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ ఓ వైపు జరుగుతోంది. మరోవైపు ఆయన తమిళ్‌లో వరుసగా ప్రాజెక్టులు చేస్తున్నారు. లేటెస్ట్ గా వడివేలు, ఉదయనిధి స్టాలిన్ సినిమా మామన్నన్‌లో కీ రోల్ చేశారు ఫాహద్.
మారి సెల్వరాజ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు ఫాహద్. ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రైలర్‌కి చాలా మంచి స్పందన వస్తోంది. వడివేలు, ఫాహద్ ఫాజిల్, కీర్తీ సురేష్ రోల్స్ చాలా బావున్నాయన్నది టాక్. మూడు నిమిషాల పాటు సాగే ఈ వీడియోలో వైగై పుయల్ వడివేలు సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. మనుషుల్ని కుక్కలు వేటాడటం, కీర్తీ సురేష్ ఇంటెన్స్ డైలాగ్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. కీర్తీ యాక్టివిస్ట్ గా మెప్పిస్తారనే కాన్ఫిడెన్స్ కుదురుతోంది. ఫాహద్ రూత్‌లెస్ పొలిటీషియన్‌గా కనిపిస్తున్నారు. స్టాలిన్, ఫాహద్ మధ్య గొడవ ఏంటో తెలియాలంటే సినిమా చూడాలి.
ఎ.ఆర్.రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ నేచురల్‌గా ఉంది. సెల్వ ఆర్‌కే ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. ఈ నెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మధ్య ఉదయనిధి స్టాలిన్ సక్సెస్ మీదున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని బట్టి, ఆయన ఖాతాలో మరో హిట్ గ్యారంటీ అంటున్నారు క్రిటిక్స్. వడివేలు కెరీర్‌లోనూ ఇది తప్పకుండా స్పెషల్ మూవీ అవుతుందని, ఇప్పటిదాకా ఆయనకున్న ఇమేజ్ మారుతుందని అనిపిస్తోంది.