English | Telugu

ఎన్టీఆర్ సినిమాలో రామ్ చరణ్ హీరోయిన్!

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత హృతిక్ రోషన్ తో కలిసి నటించనున్న 'వార్-2'తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. నవంబర్ లోపు 'దేవర' షూటింగ్ పూర్తి చేసి, ఆ వెంటనే ఎన్టీఆర్ 'వార్-2'తో బిజీ కానున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ నటించనుందని సమాచారం.

యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ కి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటిదాకా ఈ యూనివర్స్ లో భాగంగా 'ఏ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్', 'పఠాన్' సినిమాలు రాగా అన్నీ ఘన విజయం సాధించాయి. ప్రస్తుతం 'టైగర్-3' షూటింగ్ దశలో ఉంది. 'వార్-2' ఈ ఏడాది నవంబర్ లో పట్టాలెక్కనుంది. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ వంటి స్టార్లు తలపడనుండటంతో ఇంకా అధికారిక ప్రకటన కూడా రాకుండానే అంచనాలు ఆకాశాన్నంటాయి. సౌత్ బిగ్ స్టార్, నార్త్ బిగ్ స్టార్ కలిసి నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సంచలనాలు సృష్టించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హృతిక్ కి జోడిగా కియారా అద్వానీని ఎంపిక చేసినట్లు వినికిడి. బాలీవుడ్ బ్యూటీ కియారాకి తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. మహేష్ బాబు 'భరత్ అనే నేను', రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' వంటి తెలుగు సినిమాల్లో నటించిన ఆమె, ప్రస్తుతం చరణ్ తో కలిసి 'గేమ్ ఛేంజర్'లోనూ నటిస్తోంది.

'ఆర్ఆర్ఆర్' తర్వాత 'దేవర' సినిమాను మొదలు పెట్టడానికి ఎక్కువ సమయం తీసుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. నవంబర్ లోపు 'దేవర' షూటింగ్ పూర్తి చేసి, నవంబర్ నుంచి 'వార్-2' షూటింగ్ లో పాల్గొననున్నాడు. అది పూర్తి కాగానే 2024 ఏప్రిల్ నుంచి ప్రశాంత్ దర్శకత్వంలో చేయనున్న 'ఎన్టీఆర్ 31'తో బిజీ కానున్నాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.